OMG : హోటల్‌లో సీక్రెట్ కెమెరాలు.. 1600 మంది వీడియోలు రికార్డ్, లైవ్‌లో ప్రసారం

దక్షిణ కొరియాలో దారుణం జరిగింది. అతిపెద్ద స్పై క్యామ్ స్కాండల్ వెలుగులోకి వచ్చింది. హోటల్స్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టి 1600 మంది వీడియోలను రికార్డ్ చేశారు. అంతేకాదు వారి

  • Published By: veegamteam ,Published On : March 21, 2019 / 05:15 PM IST
OMG : హోటల్‌లో సీక్రెట్ కెమెరాలు.. 1600 మంది వీడియోలు రికార్డ్, లైవ్‌లో ప్రసారం

Updated On : March 21, 2019 / 5:15 PM IST

దక్షిణ కొరియాలో దారుణం జరిగింది. అతిపెద్ద స్పై క్యామ్ స్కాండల్ వెలుగులోకి వచ్చింది. హోటల్స్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టి 1600 మంది వీడియోలను రికార్డ్ చేశారు. అంతేకాదు వారి

దక్షిణ కొరియాలో దారుణం జరిగింది. అతిపెద్ద స్పై క్యామ్ స్కాండల్ వెలుగులోకి వచ్చింది. హోటల్స్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టి 1600 మంది వీడియోలను రికార్డ్ చేశారు. అంతేకాదు వారి చర్యలను లైవ్ లో చూపించారు.  ఈ స్పై స్కామ్ స్కాండల్ సంచలనంగా మారింది. సౌత్ కొరియాలోని 10 నగరాల్లోని ప్రముఖ హోటళ్లలోని 42 గదులు, 30 సూట్స్ లో బస చేసిన 1600 మంది చేస్తున్న పనులన్నీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా కనిపించడం తీవ్ర కలకలం రేపింది. కొందరు వ్యక్తులు పక్కా ప్లాన్ ప్రకారం స్పై కామ్ స్కాండల్ కు స్కెచ్ వేశారని పోలీసుల విచారణలో తేలింది.
Read Also : చావుతో ఆటలు : PubG ఆడుతూ నరాలు పట్టేసి.. చనిపోయాడు

హోటళ్ల గదుల్లో రహస్య కెమెరాలను అమర్చారు. వాటన్నింటినీ ఒకేసారి ఆన్ చేసి, గదుల్లో వారి చర్యలను లైవ్ లో చూపించారు. ఈ దృశ్యాలను 4 వేల మందికి పైగా చూశారని, అందులో 97 మంది ఫుటేజ్ ని రీప్లేలో చూసేందుకు 44.95 డాలర్ల చొప్పున చెల్లించినట్టు గుర్తించామని పోలీసు అధికారులు వెల్లడించారు. ప్రత్యక్ష ప్రసారాలు జరుగుతుంటేనే తాము గుర్తించి అడ్డుకున్నామని తెలిపారు.

హోటల్ గదుల్లోని డిజిటల్ టీవీ బాక్సులు, వాల్ సాకెట్లు, హెయిర్ డ్రయర్ హోల్డర్లు తదితరాల్లో కెమెరాలను ఫిక్స్ చేశారని విచారణలో తేలింది. ఈ స్కామ్ వెనుక హోటల్ యాజమాన్యాల పాత్రపై ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ కేసుతో సంబంధముందని భావిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశామని, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారన్న అభియోగాలపై పలువురిని ప్రశ్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఇలాంటి సీక్రెట్ కెమెరాల స్కాండల్స్, మహిళలను చాటుగా వీడియోలు తీస్తూ ప్రత్యక్ష ప్రసారం చేయడాలు.. కొరియాలో ఇదేమీ ఫస్ట్ టైమ్ కాదు. 2012లో ఇల్లీగల్ ఫిల్మింగ్ పై 2వేల 400 కేసులు నమోదుకాగా, 2017లో ఏకంగా 6వేల 400 కేసులు నమోదయ్యాయి. ఇల్లీగల్ ఫిల్మింగ్ వ్యవహారం దుమారం రేపుతోంది. దీనిపై స్థానికంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. అయినా ఆగడాలు మాత్రం ఆగడం లేదు.
Read Also : జగన్ నామినేషన్: పులివెందులలో సందడి