Gurumurthy, Venkata Madhavi
Hyderabad Retired Soldier Kills Wife News: రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ భర్త తన భార్యను ముక్కలుముక్కలుగా నరికి చంపేశాడు. సాక్ష్యాలు దొరకకుండా నరికిన ముక్కలను కక్కర్ లో ఉండికించి.. ఆ తరువాత వాటిని డ్రైనేజీలో పడేశాడు. బొక్కలను ఇంట్లోనే కాల్చేసి పొండిచేసి ఆ పొడిని చెరువులో కలిపేశాడు. ఈ దారుణ ఘటన ఈనెల 16న జరగగా.. బుధవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది.. అయితే, పోలీసులు భర్తను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం చేసింది అతనే అని నిర్ధారణకు వచ్చారు. అయితే, అతడే నేరం చేశాడని చెబుతున్నప్పటికీ.. చనిపోయింది అతని భార్యేనని నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు లేకపోవటంతో పోలీసులకు ఈ కేసు సవాల్ గా మారింది.
ప్రకాశం జిల్లాకు చెందిన ఉప్పల సుబ్బమ్మ, వెంకటరమణ భార్యాభర్తలు. వీరికి ముగ్గురు బిడ్డలు. వారి పెద్దకుమార్తె వెంకటమాధవి(35)ని పదమూడేళ్ల క్రితం అదే జిల్లాకు చెందిన గురుమూర్తికి ఇచ్చి వివాహం చేశారు. వారికి ఇద్దరు పిల్లలు. గురుమూర్తి ఆర్మీలో జవాన్ గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. అయితే, గురుమూర్తి తన భార్యపై అనుమానంతో తరచూ వారిద్దరి మధ్య ఘర్షణలు జరిగేవి. ఈ క్రమంలో ఈనెల 16నసైతం వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో పిల్లలకు సెలవులు ఉండటంతో ఇంట్లోలేరు. మరుసటిరోజు తన భార్య కనిపించడం లేదని మీర్ పేట్ పోలీసులకు గురుమూర్తి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా.. సీసీ కెమెరాల ఆధారంగా భర్త గురుమూర్తే నిందితుడని గుర్తించారు.
సీసీ కెమెరాల్లో 16వ తేదీ, ఆ తరువాత మాధవి ఇంట్లో నుంచి బయటకు వచ్చినట్లు ఎక్కడా కనిపించలేదు. గురుమూర్తి మాత్రం పలుసార్లు కవర్లు పట్టుకొని ఇంట్లో నుంచి బయటకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకొని విచారించగా వెంకటమాధవిని తానే హత్యచేసినట్లు ఒప్పుకున్నాడు. భార్యను హత్యచేసి ఆమె బాడీని మటన్ కత్తితో ముక్కలు ముక్కలుగా నరికాడు. ఎముకల నుంచి మాంసాన్ని వేరుచేసి.. ఆ మాంసాన్ని ఇంట్లోని కుక్కర్ లో దఫదఫాలుగా ఉండికించాడు. ఆ తరువాత ఎముకలను కాల్చి ఆ పొడిని ఒక కవర్లోకి తీసుకున్నాడు. కుక్కర్ లో ఉడికించిన ముక్కలను డ్రైనేజీల్లో పడేసి, ఎముకల బూడిదను మీర్ పేట చందచెరువులో కలిపాడు. అయితే, పోలీసుల విచారణలో విస్తుపోయే మరో విషయం ఏమిటంటే.. భార్యను చంపడానికి ముందు అతడు ఓ కుక్కను చంపి అదేవిధంగా ప్రాక్టీస్ చేసినట్లు తెలిసింది.
Also Read: Maoist Chalapati : మావోయిస్టు అగ్రనేత చలపతి హతం.. భార్యతో తీసుకున్న సెల్ఫీ వల్ల ప్రాణం పోయిందట..!
ఈ కేసులో పోలీసులకు పెద్ద సవాల్ ఎదురవుతుంది. భర్త గురుమూర్తి హంతకుడని తేల్చిన పోలీసులకు.. అతడు నేరం చేశాడని నిరూపించేందుకు సాక్ష్యాధారాలు మాత్రం లేవు. నిందితుడు హత్యకు సంబంధించిన ఆనవాళ్లు దొరకకుండా ఈ దారుణానికి పాల్పడ్డాడు. పోలీసులకు చనిపోయింది వెంకటమాధవినే అని నిరూపించాల్సి ఉంటుంది. ఆమె ఎముకల పొడిని చెరువులో కలిపేయడంతోపాటు.. డ్రైనేజీల్లో ఆమె శరీర భాగాలను పడేశాడు. డ్రైనేజీలో పడేసిన మాంసపు ముద్దలను పోలీసులు సేకరిస్తే డీఎన్ఏ పరీక్ష ద్వారా చనిపోయింది మాధవినే అని నిరూపించే అవకాశం పోలీసులకు ఉంటుంది.