Chicken : వార్నీ.. భార్య చికెన్ వండలేదని భర్త ఆత్మహత్య

Suicide For Chicken : చికెన్ వండేది లేదని భార్య తేల్చి చెప్పింది. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అంతే, క్షణాకావేశానికి లోనైన పవన్..

Chicken : వార్నీ.. భార్య చికెన్ వండలేదని భర్త ఆత్మహత్య

Chicken (Photo : Google)

Updated On : May 28, 2023 / 11:50 PM IST

Suicide For Chicken : వెర్రితనం అనాలో, అవివేకం అనాలో, అజ్ఞానం అనాలో అర్థంకాని పరిస్థితి. చిన్న చిన్న విషయాలు, కారణాలకే కొందరు చనిపోతున్నారు. క్షణికావేశంలో, మనస్తాపంతో వెలకట్టలేని ప్రాణాలను తీసుకుంటున్నారు. చిన్న విషయాలకే ఆత్మహత్య చేసుకుంటున్న వారి సంఖ్య ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. తాజాగా.. భార్య చికెన్ వండలేదని ఓ భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన అందరినీ విస్మయానికి గురి చేసింది.

అవును.. భార్య చికెన్ వండలేదనే చిన్నపాటి విషయానికే మనస్తాపంతో భర్త సూసైడ్ చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీలో ఈ ఘటన జరిగింది. పవన్ అనే వ్యక్తి రాత్రి వేళ ఇంటికి వెళ్తూ వెళ్తూ చికెన్ పట్టుకెళ్లాడు. ఆ చికెన్ ను భార్యకు ఇచ్చి వండమని చెప్పాడు.

అయితే, అందుకు భార్య నిరాకరించింది. చికెన్ వండేది లేదని తేల్చి చెప్పింది. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అంతే, క్షణాకావేశానికి లోనైన పవన్.. ఉరి వేసుకుని ఆత్యహత్య చేసుకున్నాడు. దీంతో అంతా షాక్ అయ్యారు. కాగా, పవన్ దంపతులకి రెండేళ్ల కూతురు ఉంది.

Also Read..Chinese Influencer : నాన్‌స్టాప్‌గా 4 బాటిళ్ల మద్యం తాగేశాడు.. కట్ చేస్తే ఘోరం జరిగిపోయింది.. షాకింగ్ వీడియో

పవన్ కుమార్(36) కార్పెంటర్ గా పని చేస్తాడు. ఝాన్సీ హన్సారీలో నివాసం ఉంటాడు. రాత్రి చికెన్ ఇంటికి తీసుకొచ్చాడు. కూర వండాలని భార్యను అడిగాడు. అయితే, చికెన్ వండేందుకు భార్య నిరాకరించింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. భార్య, భర్త ఇద్దరూ వాదించుకున్నారు. ఈ క్రమంలో భర్త పవన్ తన రూమ్ లోకి వెళ్లిపోయాడు. భార్య మరో రూమ్ లోకి వెళ్లిపోయింది.

కాసేపటి తర్వాత పవన్ సోదరి.. పవన్ రూమ్ దగ్గరికి వెళ్లింది. తలుపు తట్టింది. అయితే పవన్ తలుపు తెరవలేదు. లోపలి నుంచి ఎలాంటి స్పందనా లేదు. ఎన్నిసార్లు తలుపు తట్టినా పవన్ డోర్ ఓపెన్ చెయ్యలేదు. దీంతో కంగారుపడిన సోదరి ఈ విషయాన్ని తల్లిదండ్రులతో చెప్పింది. పవన్ తండ్రి, పవన్ పెద్ద అన్నయ్య పరుగున అక్కడికి చేరుకున్నారు. డోర్ ని బద్దలుకొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ తాడుకి వేలాడుతూ పవన్ విగతజీవిగా కనిపించాడు. అంతే, అంతా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. పవన్ ఇంత పని చేస్తాడని వారు అస్సలు ఊహించలేదు.

Also Read.. Viral Video : ఛీ..ఛీ.. మనిషేనా? మూత్రంతో ఇల్లు తుడిచిన పనిమనిషి.. సీసీ కెమెరాతో వెలుగులోకి వచ్చిన దారుణం

రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. పవన్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. పవన్ మృతికి కారణం పోస్టుమార్టం నివేదికలో తెలుస్తుందన్నారు. కాగా, పవన్ ప్రియాంకను నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడని, ఇద్దరూ చాలా సంతోషంగా ఉండేవారని కుటుంబసభ్యులు తెలిపారు. ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలూ లేవన్నారు. పవన్ ఇంత తీవ్ర నిర్ణయం తీసుకుంటాడని మేము ఎవరూ ఊహించలేదని పవన్ తండ్రి కన్నీటిపర్యంతం అయ్యారు. పవన్ మృతితో అతడి కుటుంబం షాక్ కి గురైంది. పవన్ కి ఇద్దరు అన్నలు ఉన్నారు. పెద్దన్న పేరు కమలేశ్. రెండో అన్న దీపక్ ఆర్మీలో సైనికుడిగా పని చేస్తాడు. ఇక మూడో వాడు పవన్ కార్పెంటర్ గా పని చేస్తాడు.