Viral Video : ఛీ..ఛీ.. మనిషేనా? మూత్రంతో ఇల్లు తుడిచిన పనిమనిషి.. సీసీ కెమెరాతో వెలుగులోకి వచ్చిన దారుణం

Viral Video : పని మనిషి ఇంట్లోనే బకెట్ లో మూత్రం పోస్తుంది. ఆ తర్వాత ఆ బకెట్ లోని నీటితోనే రోజూ ఇంటిని తుడుస్తున్నట్లు గుర్తించాడు.

Viral Video : ఛీ..ఛీ.. మనిషేనా? మూత్రంతో ఇల్లు తుడిచిన పనిమనిషి.. సీసీ కెమెరాతో వెలుగులోకి వచ్చిన దారుణం

Maid Urinating (Photo : Google)

Viral Video-Maid Urinating : ఈరోజుల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మే పరిస్థితి లేదు. పొరపాటున నమ్మేశామో ఇక అంతే సంగతులు. మనకు తెలియకుండానే దారుణాలు, ఘోరాలు జరిగిపోవచ్చు. ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో జరిగిన ఓ ఘటన అందరినీ షాక్ కి గురి చేస్తోంది. ఓ ఇంట్లో పని మనిషి చేసిన పాడు పని నివ్వెరపోయేలా చేసింది. ఛీ..ఛీ.. మనిషేనా? అని అంతా తిట్టిపోస్తున్నారు. అంతేనా.. ఇంట్లో పనిమనిషిని పెట్టుకోవాలంటే భయపడిపోయే పరిస్థితి వచ్చింది.

అసలేం జరిగిందంటే.. పని మనిషి తన మూత్రంతో ఇంటిని తుడుస్తోంది. ఏంటి షాక్ అయ్యారా? అవును.. ఓ పనిమనిషి దారుణానికి ఒడిగట్టింది. గ్రేటర్ నోయిడాలోని అజ్ నారా హోమ్స్ సొసైటీలో అలోక్ సింగ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతడు పని మనిషిని పెట్టుకున్నాడు. రోజూ ఆమె వచ్చి ఇంటిని శుభ్రం చేసి వెళ్తుంది. అయితే, అలోక్ సింగ్ ఓ రోజు ఎందుకో.. తన సీసీ కెమెరా ఫుటేజీ చెక్ చేశాడు. అంతే, అందులో కనిపించిన దృశ్యం చూసి అతడు షాక్ కి గురయ్యాడు. అతడి నోట మాట పడిపోయింది.(Viral Video)

Also Read..Goa Robbery : బీకేర్ ఫుల్.. ఇంటి బయట ఒంటరిగా కూర్చుంటున్నారా? ఎంత ప్రమాదమో చూడండి.. షాకింగ్ వీడియో

పని మనిషి ఇంట్లోనే బకెట్ లో మూత్రం పోస్తుంది. ఆ తర్వాత ఆ బకెట్ లోని నీటితోనే రోజూ ఇంటిని తుడుస్తున్నట్లు అలోక్ సింగ్ గుర్తించాడు. సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దీనిపై ఓనర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆ పనిమనిషిని అరెస్ట్ చేశారు.

పని మనిషి చేసిన పాడుపనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఛీ..ఛీ.. మనిషేనా? అని అంతా తిడుతున్నారు. ఇలాంటి వాళ్లను ఏం చేసినా పాపం లేదంటున్నారు. ఈరోజుల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మే పరిస్థితి లేకుండా పోయిందని వాపోయారు. దానికి ఇదేం మాయరోగం? ఎందుకిలా శాడిస్ట్ లా ప్రవర్తిస్తోంది? అని నెటిజన్లు మండిపడుతున్నారు.(Viral Video)

కొత్త వారిని పని మనిషిగా పెట్టుకునే ముందు ఇంటి యజమాని చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పడానికి ఇలాంటి ఘటనలే నిదర్శనం అంటున్నారు. ఎవరిని పడితే వారిని పనిలో పెట్టుకుంటే ఇదిగో ఇలాంటి ఘోరాలే జరుగుతాయంటున్నారు. అందుకే పనిలోకి తీసుకునే ముందు, తీసుకున్న తర్వాత కూడా పని మనిషిపై కచ్చితంగా నిఘా ఉండటం ఇంటి యజమానికి ఎంతో మంచిదంటున్నారు నెటిజన్లు.

పని మనిషిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెని విచారించారు. మూత్రం పోసిన నీటితోనే తాను ఇంటిని శుభ్రం చేస్తున్నట్లు పోలీసుల విచారణలో ఆ పని మనిషి తన నేరాన్ని ఒప్పుకుంది. ఆ పని మనిషికున్న పాడు ప్రవర్తన గురించి ఆమె కుటుంబసభ్యులు తెలుసుని పోలీసుల విచారణలో తేలింది. గత 6 నెలలుగా అలోక్ సింగ్ ఇంట్లో ఆమె పని చేస్తోంది. తనకు ఏదైనా పని ఇవ్వాలని 6 నెలల క్రితం అలోక్ సింగ్ ను వేడుకోవడంతో.. ఆయన ఆమెను తన ఇంట్లో పని మనిషిగా పెట్టుకున్నాడని పోలీసులు తెలిపారు. చివరికి.. సీసీటీవీ కెమెరా వల్ల పని మనిషి పాడు పని గురించి ప్రపంచానికి తెలిసింది.(Viral Video)

Also Read..Karnataka : OMG.. పెట్రోల్ బంకులో ఫోన్ వాడుతున్నారా? ఎంత ప్రమాదమో చూడండి.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో