Karnataka : OMG.. పెట్రోల్ బంకులో ఫోన్ వాడుతున్నారా? ఎంత ప్రమాదమో చూడండి.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో

Petrol Pump Fire : పెట్రోల్ బంకులో సెల్ ఫోన్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కూతురు చనిపోగా, తల్లి తీవ్రగాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉంది.

Karnataka : OMG.. పెట్రోల్ బంకులో ఫోన్ వాడుతున్నారా? ఎంత ప్రమాదమో చూడండి.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో

Petrol Pump Fire (Photo : Google)

Petrol Pump Fire : వాహనంలో పెట్రోల్ కొట్టించుకునేందుకు పెట్రోల్ బంకుకి వెళ్లిన సమయంలో మొబైల్ ఫోన్ వాడుతున్నారా? పెట్రోల్ పోయించుకుంటూ ఫోన్ చూస్తున్నారా? అయితే, మీరు ప్రమాదంలో పడ్డట్టే. మీ ప్రాణాలకు ముప్పు వాటిల్లినట్లే. అవును, పెట్రోల్ బంకులో ఫోన్ వాడకం ఎంత ప్రమాదమో చెప్పే ఘటన ఒకటి కర్నాటక రాష్ట్రం తుమకూరులో జరిగింది. పెట్రోల్ బంకులో సెల్ ఫోన్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కూతురు చనిపోగా, తల్లి తీవ్రగాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉంది.

తుమకూరు జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ తల్లీకూతురు క్యాన్ లో పెట్రోల్ పోయించుకోవడానికి మోపెడ్ పై పెట్రోల్ బంక్ కి వెళ్లారు. సిబ్బంది క్యాన్ లో పెట్రోలో నింపుతున్నారు. అదే సమయంలో వారు సెల్ ఫోన్ చూస్తున్నారు. అంతే, అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. మంటలు చెలరేడంతో అంతా పరుగులు తీశారు.

Also Read..Viral Video : మహిళలూ.. బైక్ నడిపేటప్పుడు జాగ్రత్త.. రెప్పపాటులో ఎంత ఘోరం జరిగిందో చూడండి..

ఈ ప్రమాదంలో కూతురు భవ్య(18), ఆమె తల్లి రత్తమ్మ(46) తీవ్రంగా గాయపడ్డారు. కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూతురు భవ్య చనిపోయింది. ఆమె తల్లి తీవ్రగాయాలతో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉంది. అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

భవ్య, రత్తమ్మ తల్లీకూతుళ్లు. క్యాన్ లో పెట్రోల్ పట్టించుకునేందుకు ఇద్దరూ కలిసి బైక్ పై పెట్రోల్ బంకుకి వెళ్లారు. తల్లి రత్తమ్మ బండి నుంచి కిందకు దిగింది. కూతురు భవ్య మాత్రం బైక్ పైనే కూర్చుని ఉంది. పెట్రోల్ బంకులో పని చేసే బాయ్.. క్యాన్ లో పెట్రోల్ నింపుతున్నాడు. ఆ సమయంలో భవ్య తన ఫోన్ చూస్తూ ఉంది. ఇక, భవ్య తల్లి కూడా తన ఫోన్ ను బయటకు తీసే పనిలో ఉంది.

Also Read..Viral Video : మార్నింగ్ వాక్ చేస్తున్న మహిళకు ఊహించని షాక్.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

అంతే, అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రాణ భయంతో అంతా అక్కడి నుంచి పరుగులు తీశారు. బండి మీదున్న భవ్య.. వెంటనే బండిని కిందకు పడేసి దూరంగా పరిగెత్తింది. బాయ్ కూడా దూరంగా పారిపోయాడు. రత్తమ్మ కూడా అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయింది. అయితే, అప్పటికే మంటల కారణంగా భవ్య, రత్తమ్మ తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భవ్య చనిపోయింది. తల్లి రత్తమ్మ పరిస్థితి విషమంగా ఉంది.

ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫోన్ వల్లనే పెట్రోల్ బంకులో ఈ అగ్నిప్రమాదం జరిగిందని గట్టిగా నమ్ముతున్నారు. వాస్తవానికి.. పెట్రోల్ బంకులో ఉన్న సమయంలో ఫోన్ వాడకూడదని నిబంధనలు ఉన్నాయి. సెల్ ఫోన్ చూడటం, మాట్లాడటం చాలా ప్రమాదకరం. మంటలు చెలరేగి అగ్నిప్రమాదం జరిగే చాన్స్ ఉంది. అయినా, కొందరు అలానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఫోన్ వాడటం, మాట్లాడటం చేస్తున్నారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తుమకూరులో ఇప్పుడు జరిగింది అదే అంటున్నారు. అందుకే, పెట్రోల్ బంకులో ఉన్న సమయంలో సెల్ ఫోన్ వాడకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంలో వాహనదారులు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.