Goa Robbery : బీకేర్ ఫుల్.. ఇంటి బయట ఒంటరిగా కూర్చుంటున్నారా? ఎంత ప్రమాదమో చూడండి.. షాకింగ్ వీడియో

Goa Robbery : పట్టపగలే జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులను భయాందోళనకు గురి చేసింది. ఇంటి బయట ఒంటరిగా కూర్చోవాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు.

Goa Robbery : బీకేర్ ఫుల్.. ఇంటి బయట ఒంటరిగా కూర్చుంటున్నారా? ఎంత ప్రమాదమో చూడండి.. షాకింగ్ వీడియో

Goa Robbery (Photo : Google)

Updated On : May 24, 2023 / 1:03 AM IST

Shocking Video : రోజులు అస్సలు బాగోలేవు. పరిస్థితులు దారుణంగా తయారవుతున్నాయి. రాత్రి పూటే కాదు.. పట్టపగలు కూడా జనాలకు భద్రత లేకుండా పోయింది. దొంగలు రెచ్చిపోతున్నారు. పట్టపగలే దోపిడీలకు పాల్పడుతున్నారు. ఒంటరిగా కనిపిస్తే చాలు దాడి చేసి దోపిడీ చేస్తున్నారు. గోవాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. తన ఇంటి బయట బెంచి మీద కూర్చున్న వృద్ధురాలిపై దాడి చేసి బంగారం దోచుకున్నారు.

ఈ ఘటన లోటౌలిమ్ ప్రాంతంలో జరిగింది. ఓ వృద్ధురాలు తన ఇంటి బయట ఉన్న బెంచిపై కూర్చుని ఉంది. అది పట్టపగలు. అయితే, ఆ రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. ఇదే సమయంలో అక్కడికి ముగ్గురు వ్యక్తులు వచ్చారు. ఇద్దరు వ్యక్తులు వృద్దురాలి దగ్గరికి వెళ్లారు. మరొకడు బైక్ పై ఉన్నాడు. ఆ ఇద్దరు వ్యక్తులు వృద్ధురాలిపై దాడి చేశారు. బలవంతంగా ఆమె చేతిలోని బంగారు గాజులు లాక్కున్నారు. మరో వ్యక్తి బైక్ పై పారిపోయేందుకు రెడీగా ఉన్నాడు.(Goa Robbery)

Also Read..Karnataka : OMG.. పెట్రోల్ బంకులో ఫోన్ వాడుతున్నారా? ఎంత ప్రమాదమో చూడండి.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో

వృద్ధురాలు తన సొమ్ముని కాపాడుకునే ప్రయత్నం చేసింది. గట్టి గట్టిగా కేకలు వేసింది. కానీ లాభం లేపోయింది. ఆ దొంగలు ఆమె బంగారు గాజులు లాక్కున్నారు. ఆ తర్వాత బైక్ పై అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే, ఆ సమయంలో అటుగా ఓ బైకర్ వచ్చారు. కానీ, అతడు ఈ దారుణాన్ని అడ్డుకోలేదు. తనకేమీ సంబంధం లేదన్నట్లుగా వెళ్లిపోయాడు. ఈ చోరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సైలెంట్ గా వెనుక నుంచి వచ్చిన దొంగలు.. అక్కడ ఎవరూ లేరని తెలుసుకుని వృద్ధురాలిపై దాడి చేశారు. వృద్ధురాలు గట్టిగా కేకలు వేసినా లాభం లేకపోయింది. వృద్ధురాలు ఒంటరిగా కనిపించడం, చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో దొంగలు బరితెగించారు. నిర్భయంగా దోపిడీకి పాల్పడ్డారు. కాగా, ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు వ్యక్తులు షార్ట్స్ వేసుకుని ఉన్నారు. మరో వ్యక్తి నైట్ ప్యాంట్ లో ఉన్నారు. అంటే.. వాకింగ్ కు వచ్చిన వారిలా కనిపించేలా వారి డ్రెస్ ఉంది. ఎవరికీ అనుమానం రాకుండా, వాకింగ్ చేస్తున్న వారిలా నటిస్తూ ఇలా అదను చూసి దోపిడీలకు పాల్పడుతున్నారని పోలీసులు భావిస్తున్నారు.(Goa Robbery)

Also Read..Viral Video : మహిళలూ.. బైక్ నడిపేటప్పుడు జాగ్రత్త.. రెప్పపాటులో ఎంత ఘోరం జరిగిందో చూడండి..

పట్టపగలే జరిగిన ఈ చోరీ స్థానికంగా కలకలం రేపింది. స్థానికులను భయాందోళనకు గురి చేసింది. దొంగలు మరీ ఇంత ధైర్యంగా పగటి పూటే చోరీలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగించింది. ఈ ఘటనతో ఇంటి బయట ఒంటరిగా కూర్చోవాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. పోలీసులు గస్తీ పెంచాలని, తమకు భద్రత కల్పించాలని కోరుతున్నారు.