Chinese Influencer : నాన్‌స్టాప్‌గా 4 బాటిళ్ల మద్యం తాగేశాడు.. కట్ చేస్తే ఘోరం జరిగిపోయింది.. షాకింగ్ వీడియో

Chinese Influencer : ఛాలెంజ్ లో భాగంగా టిక్ టాక్ లైవ్ లో 4 ఫుల్ బాటిళ్ల లిక్కర్ తాగేశాడు. ఆ తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. మద్యం డోస్ పెరగడంతో 12 గంటల్లోనే అతడు మరణించాడు.

Chinese Influencer : నాన్‌స్టాప్‌గా 4 బాటిళ్ల మద్యం తాగేశాడు.. కట్ చేస్తే ఘోరం జరిగిపోయింది.. షాకింగ్ వీడియో

Chinese influencer (Photo : Google )

Chinese Influencer – Liquor : సోషల్ మీడియా పుణ్యమా అని యువతలో పిచ్చి పీక్స్ కి చేరింది. పాపులారిటీ, పబ్లిసిటీ అంటూ.. పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో మృత్యుఒడికి చేరుకుంటున్నారు. వారు అనుకున్నట్లుగా పాపులారిటీ వచ్చిందో లేదో తెలియదు కానీ.. విలువైన ప్రాణాలను కోల్పోతున్నారు. చిన్న వయసులో తిరిగిరాని లోకాలకు చేరుకుంటున్నారు. తాజాగా చైనాకు చెందిన ఓ యువకుడు.. లైవ్ స్ట్రీమ్ కంటెస్ట్ పేరుతో చేసిన ప్రయోగం వికటించింది. అతడి ప్రాణం తీసింది.

Also Read..America : వివాదాలకు కేరాఫ్ అడ్రస్ ‘హార్ట్ ఎటాక్’ రెస్టారెంట్

చైనాలో స్కానియాంగ్ (34) అనే వ్యక్తి ఓ ఛాలెంజ్ లో భాగంగా టిక్ టాక్ లైవ్ లో 4 ఫుల్ బాటిళ్ల లిక్కర్ తాగేశాడు. ఆ తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. మద్యం డోస్ పెరగడంతో 12 గంటల్లోనే అతడు మరణించాడు. స్కానియాంగ్ ఒక సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ అని పోలీసులు తెలిపారు. అతడు తాగిన లిక్కర్ లో 30 నుంచి 60శాతం ఆల్కహాల్ కంటెంట్ ఉంటుందన్నారు. గతంలోనూ ఇలా లైవ్ లో మద్యం తాగినందుకు అతడి అకౌంట్ బ్యాన్ అయ్యింది. అయితే, మరో పేరుతో అతడు అకౌంట్ ఓపెన్ చేశాడు.

స్కానియాంగ్.. చైనా వెర్షన్ టిక్ టాక్ లో ఆన్ లైన్ ఛాలెంజ్ చేశాడు. ఇందులో భాగంగా ఆపకుండా 4 బాటిళ్ల మద్యం తాగాడు. అతడు తాగిన ఆల్కహాల్ ను బైజూ అంటారు. అది చైనా రకం స్పిరిట్. చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అందులో 30 నుంచి 60శాతం ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది. తన సహచర ఇన్ ఫ్లుయెన్సర్ తో స్కానియాంగ్ ఆన్ లైన్ చాలెంజ్ చేశాడు.

Also Read..Diabetes Oral Insulin : మధుమేహానికి ఓరల్ ఇన్సులిన్.. ప్రపంచంలోనే తొలిసారి చైనాలో

ఆ ఆన్ లైన్ చాలెంజ్ పేరు PK. ఇందులో భాగంగా కంటెస్టెంట్ లు పోటీపడి ఆపకుండా మద్యం తాగాల్సి ఉంటుంది. ఎవరైతే ఎక్కువ మందు బాటిల్స్ తాగుతారో వాళ్లే విజేతలు. విన్నర్ కు వ్యూయర్స్ నుంచి రివార్డ్స్, గిఫ్ట్ అందుతాయి. లూజర్ కి పన్మిష్ మెంట్ ఉంటుంది. ఈ ఆన్ లైన్ చాలెంజ్ లో భాగంగా స్నానియాంగ్ రెచ్చిపోయాడు. ఆపకుండా నాలుగు మద్యం బాటిళ్లు తాగేశాడు. ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే అతడు ప్రాణాలు వదిలాడు.

కాగా, చైనాలో లైవ్ స్ట్రీమింగ్ చాలెంజ్ లు.. ఇటు ఇన్ ఫ్లుయెన్సర్లకు అటు మద్యం కంపెనీలకు కాసుల పంట పండిస్తున్నాయి. ఈ పోటీల్లో భాగంగా ఇన్ ఫ్లుయెన్సర్లతో మద్యం కంపెనీలు ఒప్పందం చేసుకుంటాయి. చాలెంజ్ లో భాగంగా తాము తయారు చేసిన మద్యాన్ని తాగాలని చెబుతాయి. అలా తమ ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేసుకుంటాయి. అందుకోసం వారికి భారీగా డబ్బులు ఇస్తాయి.

ఈ ఆఫర్ ఇన్ ఫ్లుయెన్సర్లను బాగా అట్రాక్ట్ చేస్తోంది. ఒక్క చాలెంజ్ తో విపరీతమైన డబ్బు వచ్చి పడుతుంది. అందుకే, ఇలా ప్రాణాలను పణంగా పెట్టి లైవ్ స్ట్రీమ్ చాలెంజ్ లు చేస్తున్నారు. ఈ పరిణామం పట్ల స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి విపరీత చర్యలకు అడ్డుకట్ట వేయాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు.