America : వివాదాలకు కేరాఫ్ అడ్రస్ ‘హార్ట్ ఎటాక్’ రెస్టారెంట్
ఏది తింటే హాని చేస్తుందో అది తినడానికి జనం ఎగబడతారు. అలాంటివారిని అట్రాక్ట్ చేయాలని రెస్టారెంట్ ఓనర్లు ఆలోచన చేస్తుంటారు. అమెరికాలోని 'హార్ట్ ఎటాక్' రెస్టారెంట్ ఆ కోవలోకే వస్తుంది. జంక్ ఫుడ్ అంటే పడి చచ్చేవారికి వింత థీమ్‌తో వంటకాలు వడ్డిస్తోంది ఈ రెస్టారెంట్.

America
America- Heart Attack Restaurant : జనాల్ని అట్రాక్ట్ చేయడానికి రెస్టారెంట్ నిర్వాహకులు చిత్రమైన పేర్లు, చిత్రమైన థీమ్ లతో ఆకట్టుకుంటారు. అమెరికాలోని ఓ రెస్టారెంట్ పేరు వింటే కాసేపు అలా ఉండిపోతారు. దాని పేరు ‘హార్ట్ ఎటాక్’.. అక్కడ ఎలాంటి ఫుడ్ దొరుకుతుందని భయం కూడా వేస్తుంది కదా..
Gudivada Amarnath : హైదరాబాద్‌లో మైక్రోసాప్ట్ కంపెనీ వస్తే అమెరికాలో మూసేసి వచ్చినట్టా?
జంక్ ఫుడ్ ఆరోగ్యానికి ఎంత హాని చేస్తుందని తెలిసినా చాలామంది దానివైపే మొగ్గుచూపుతారు. అలాంటి రెస్టారెంట్లకి ఎగబడతారు. ఇక అలాంటి వారిని తమ రెస్టారెంట్లకి రప్పించుకోవాలనే ప్లాన్‌తో అమెరికాలో ‘హార్ట్ ఎటాక్’ రెస్టారెంట్ సరికొత్త థీమ్ ను ఫాలో అవుతోంది. ఈ రెస్టారెంట్‌ను జాన్ బాసో అనే వ్యక్తి 2005 లో స్టార్ట్ చేశాడు. లోపలికి వెళ్లగానే రెస్టారెంట్‌కి వచ్చామా? ఆసుపత్రికి వచ్చామా? అని డౌట్ వస్తుంది. ఇక్కడికి వచ్చే కస్టమర్లు పేషెంట్స్ లాగా గౌనులు వేసుకుని లోనికి వెళ్లాలి. ఇక్కడ వెయిట్రస్ నర్సులుగా.. వెయిటర్లు డాక్టర్లుగా కనిపిస్తారు. అలాగే పిలవాలండోయ్.
220 Kg Of Pasta in US Forest : యూఎస్ పారెస్ట్‌లో 220 కేజీల పాస్తా ఎందుకు పడేశారు?
కస్టమర్స్ ఇచ్చే ఆర్డర్‌ను ప్రిస్క్రిప్షన్ అంటారట. ఇక్కడ దొరికే హ్యామ్ బర్గర్‌లో 10 వేల క్యాలరీలు ఉంటాయట. ఇక అదంతా బాడీలోకి వెళ్తే.. ఊహించండి. ఇలా ఇక్కడ అన్నీ అతిగానే ఉంటాయట. బటర్ ఫ్యాట్, మిల్క్ షేక్, ఫుల్ షుగర్ కోలా, పిల్లల కో్సం క్యాండీ సిగరెట్స్ దొరుకుతాయట. ఆర్డర్ చేశారు సరే తెచ్చినవి తినకపోతే ఊరుకోరు.. సరదాగా బెల్టుతో కొడతారట. ఇంకో విషయం ఏంటంటే 350 పౌండ్ల కన్నా బరువున్న వారు ఈ రెస్టారెంట్‌కి వెళ్తే ఫ్రీగా ఫుడ్ పెడతారట. వింటూంటేనే భయంకరంగా అనిపిస్తోంది.. ఇక రెస్టారెంట్ కి వెళ్తే పరిస్థితి ఏంటో?.. వీక్ గా ఉండేవారికి నిజంగా హార్ట్ ఎటాక్ వచ్చినా ఆశ్చర్యం లేదు.
View this post on Instagram
View this post on Instagram