Husband Harassment : ప్రేమ పెళ్లి-ఆడ పిల్లలు పుట్టారని వదిలేసిన భర్త

ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఆడపిల్లలు పుట్టారని భార్యను వదిలేసిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. భర్త వదిలేయటం...  పిల్లల్ని పోషించలేక బతుకు భారమై   ఆ మహిళ ఆత్మహత్యాయత్నం

Husband Harassment : ప్రేమ పెళ్లి-ఆడ పిల్లలు పుట్టారని వదిలేసిన భర్త

husband harassement

Updated On : March 1, 2022 / 3:34 PM IST

Husband Harassment : ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఆడపిల్లలు పుట్టారని భార్యను వదిలేసిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. భర్త వదిలేయటం…  పిల్లల్ని పోషించలేక బతుకు భారమై   ఆ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది.

బుక్కపట్నం మండలం కొడపగాని పల్లికి చెందిన మమత అదే ఊరిలో వీఆర్వో గా పని చేస్తున్న రామ్మోహన్ తో ప్రేమ లో పడింది, వీరిద్దరూ 8 ఏళ్ళ క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు పుట్టారు. ఇద్దరూ కూతుళ్లే పుట్టటంతో రామ్మోహన్ మమత నుంచి దూరమయ్యాడు. భార్యా పిల్లల్నివదిలేసి వెళ్లిపోయాడు.  ఎప్పుడో ఒకసారి ఇంటికి రావటం మొదలెట్టాడు.

ఈక్రమంలో రామ్మోహన్ తాను పని చేస్తున్న సచివాలయంలోనే ఒక వివాహిత యువతితో సహజీవనం చేస్తున్నట్లు మమత తెలుసుకుంది. దీంతో అతడ్ని నిలదీయడంతో ఆమెపై పలుమార్లు దాడికి యత్నించాడు. అతని వేధింపులు తాళలేక   2021 డిసెంబర్ లో ఎస్పీకి ఫిర్యాదుచేసింది. అప్పుడు రామ్మోహన్ ను దిశ పోలీసు స్టేషన్ కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.  అయినా అతనిలో మార్పురాలేదు. పైగా ఇంటి ముఖం కూడా చూడటంలేదు.
Also Read : Russia-Ukraine War: కీవ్ నగరాన్ని అత్యవసరంగా ఖాళీ చేయాలని ఆదేశాలు.. ఏం జరగబోతోంది?
ప్రస్తుతం   ఆమె తండ్రి వద్ద ఉంటోంది, కాగా వృధ్ధాప్యంలో ఉన్న తండ్రి   ఆమెను   పిల్లల్ని పోషించలేక పోతుండటంతో కలెక్టర్‌ను కలవాలనుకుని  కలెక్టరేట్‌కు  వెళ్లింది. అక్కడికి వెళ్లిన తర్వాత తన ఆలోచన మార్చుకుని   కలెక్టరేట్ ఎదురుగా ఉన్న చెరువు లోకి పిల్లల్ని తోసేసి తాను ఆత్మహత్య చేసుకోబోయింది. ఇది చూసిన స్ధానికులు వారిని   కాపాడి జాయింట్ కలెక్టర్ వద్దకు తీసుకువెళ్లగా   అక్కడ ఆమె తన గోడు వెళ్లబోసుకుంది. జాయింట్  కలెక్టర్  సిరి  వెంటనే స్పందించి  కదిరి ఆర్డీఓకు  ఫోన్ చేసి న్యాయం చేయాలని ఆదేశించారు.