Dead Body In Almirah : దారుణం.. భార్యను చంపి మృతదేహాన్ని అల్మారాలో దాచిన భర్త

తాగుడికి బానిసగా మారిన భర్త.. కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. ఆ తర్వాత డెడ్ బాడీని అల్మారాలో దాచాడు. వెస్ట్ బెంగాల్ హుగ్లీలో ఈ దారుణం జరిగింది.

Dead Body In Almirah : దారుణం.. భార్యను చంపి మృతదేహాన్ని అల్మారాలో దాచిన భర్త

Updated On : December 12, 2022 / 10:20 PM IST

Dead Body In Almirah : మద్యం ఆరోగ్యానికి హానికరం అని డాక్టర్లు నెత్తీనోరు బాదుకుని చెబుతున్నా.. మద్యపానం వల్ల జరుగుతున్న అనేక అనర్థాలను కళ్లారా చూస్తున్నా ఇంకా కొందరిలో మార్పు రావడం లేదు. మద్యానికి బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మద్యం మత్తులో దారుణాలకు ఒడిగడుతున్నారు. హత్యలు చేసేందుకు కూడా వెనుకాడటం లేదు. తాజాగా వెస్ట్ బెంగాల్ హుగ్లీలో మద్యం ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. తాగుడికి బానిసగా మారిన భర్త.. కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. ఆ తర్వాత డెడ్ బాడీని అల్మారాలో దాచాడు.

Also Read..Cyber Fraud సైబర్ మోసం.. కిడ్నీ అమ్మేందుకు ప్రయత్నించి రూ.16 లక్షలు పోగొట్టుకున్న యువతి.. అసలు కథ ఇదీ!

హుగ్లీ చిసురాలో నివాసం ఉండే కాశీనాథ్, భారతీలు దంపతులు. కాగా, కాశీనాథ్ మద్యానికి బానిసగా మారాడు. నిత్యం తాగి ఇంటికి వచ్చేవాడు. భార్యను వేధించేవాడు. తన తాగుడికి డబ్బు ఇవ్వాలని రోజూ భార్యతో గొడవపడే వాడు. ఈ క్రమంలో నిన్న రాత్రి కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తాగేందుకు డబ్బులు ఇవ్వమని భర్త అడిగాడు. అందుకు భార్య ఒప్పుకోలేదు. కోపంతో ఊగిపోయిన భర్త.. భార్యను చంపేశాడు. ఆ తర్వాత ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు.. భార్య మృతదేహాన్ని అల్మారాలో దాచి పారిపోయాడు.

Also Read..Nizamabad Srikanth : 80రోజుల క్రితం అదృశ్యం, చెట్టుకు వేలాడుతున్న శ్రీకాంత్ మృతదేహం.. అసలేం జరిగింది?

కాగా, వాళ్ల కుమారుడు విశ్వనాథ్.. తనకు అవసరమైన వస్తువుల కోసం అల్మారా తెరవగా షాక్ అయ్యాడు. అందులో కుళ్లిన స్థితిలో తల్లి మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేపట్టారు. భర్తే భార్యను మర్డర్ చేసి శవాన్ని అల్మారాలో దాచినట్లు పోలీసులు విచారణలో తేలింది. కొన్నిరోజులుగా ఆ మహిళ కనిపించకపోవడంతో ఎక్కడికి పోయిందా అని అంతా ఆరా తీశారు. ఇప్పుడామె శవం కనిపించడంతో కుటుంబసభ్యులు, స్థానికులు షాక్ అయ్యారు. భార్యను మర్డర్ చేసిన తాగుబోతు భర్త ఆమె మృతదేహాన్ని అల్మారాలో దాచాడని తెలుసుకుని నివ్వెరపోయారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

మృతురాలి కుమారుడు విశ్వనాథ్ క్యాటరింగ్ వ్యాపారం చేస్తాడు. అతడు తల్లిదండ్రుల దగ్గర ఉండడు. అయితే, ఏదో పని మీద తల్లి ఇంటికి వచ్చిన అతడు.. తన వ్యాపార వస్తువులు తీయడానికి అల్మారా తెరిచాడు. అప్పుడు తల్లి భారతి మృతదేహం అతనికి కనిపించి షాక్ అయ్యాడు. మృతురాలు భారతీ(62) గత మూడు రోజులుగా జాడ లేదు. భారతీ భర్త కాశీనాథ్ ఏ పనీ చేసేవాడు కాదు. జులాయిగా తిరిగే వాడు. మద్యానికి బానిసగా మారాడు. మందు తాగేందుకు డబ్బు ఇవ్వాలని రోజూ భార్య భారతీతో గొడవ పడేవాడు. దీంతో ఇద్దరి మధ్య రోజూ గొడవలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు.