Cyber Fraud సైబర్ మోసం.. కిడ్నీ అమ్మేందుకు ప్రయత్నించి రూ.16 లక్షలు పోగొట్టుకున్న యువతి.. అసలు కథ ఇదీ!

ఆన్‌లైన్‌లో కిడ్నీ అమ్మేందుకు ప్రయత్నించిందో యువతి. ఆమె అవసరాన్ని ఆసరాగా చేసుకున్న సైబర్ ముఠా దోపిడీకి పాల్పడింది. ట్యాక్స్ పేరుతో ఆమె నుంచి రూ.16 లక్షలు కాజేసింది.

Cyber Fraud సైబర్ మోసం.. కిడ్నీ అమ్మేందుకు ప్రయత్నించి రూ.16 లక్షలు పోగొట్టుకున్న యువతి.. అసలు కథ ఇదీ!

Cyber Fraud: ఆన్‌లైన్‌లో కిడ్నీ అమ్మేందుకు ప్రయత్నించిన ఒక యువతి రూ.16 లక్షలు పోగొట్టుకుంది. చివరకు విషయం తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏపీ, గుంటూరుకు చెందిన ఒక యువతి హైదరాబాద్‌లో నర్సింగ్ కోర్సు చదువుకుంటోంది.

Viral Video: సింహాలతో అడుకుంటున్న బాలుడు.. చెయ్యి ఎలా కొరికిందో చూడండి.. వీడియో వైరల్

అయితే, తన అవసరాల కోసం తండ్రికి తెలియకుండా, ఆయన అకౌంట్ నుంచి రూ.2 లక్షలు వాడుకుంది. ఆ విషయం తండ్రికి తెలిస్తే ఏమంటాడో అన్న భయంతో ఆ డబ్బు ఎలాగైనా తిరిగివ్వాలనుకుంది. ఇందుకోసం కిడ్నీ అమ్మాలని నిర్ణయించుకుంది. దీనికోసం ఆన్‌లైన్‌లో వెతికింది. పలు సైట్లు చూసి కనిపించిన ఒక నెంబర్‌కు మెసేజ్ చేయగా, వారి నుంచి కాల్ వచ్చింది. తనకు డబ్బు అవసరం ఉందని, కిడ్నీ అమ్మాలనుకుంటున్నానని వారికి చెప్పింది. ఆమె అవసరాన్ని గుర్తించిన సైబర్ నేరగాళ్లు కిడ్నీ ఇస్తే ఆమెకు రూ.7 కోట్లు ఇస్తామని ఆశ చూపారు. ముందుగా ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి, రూ.3 కోట్లు వేశారు. ఆ డబ్బు రావాలంటే ట్యాక్స్ చెల్లించాలని సూచించారు. ఇది నిజమేనని నమ్మిన యువతి రూ.16 లక్షలు చెల్లించింది.

Ducati DesertX: డుకాటి కొత్త బైక్ ‘డిసర్ట్ఎక్స్ ఇండియా’.. ధర రూ.18 లక్షలు

అయినప్పటికీ వాళ్లు ఇంకా డబ్బు కావాలని అడిగారు. దీంతో విసుగొచ్చిన యువతి తాను కిడ్నీ ఇవ్వబోనని, తన డబ్బు తనకు తిరిగి ఇవ్వాలని వారిని కోరింది. దీంతో యువతిని ఢిల్లీ రావాలని సూచించింది ఆ ముఠా. వాళ్లు చెప్పినట్లు ఆమె ఢిల్లీ వెళ్లింది. వారి నుంచి స్పందన లేకపోవడంతో అప్పుడు ఆ యువతికి తాను మోసపోయినట్లు అర్థమైంది. దీంతో సోమవారం తండ్రితో కలిసి గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.