Uttar Pradesh : భర్తను చెట్టుకు కట్టేసి, వివాహితపై గ్యాంగ్ రేప్

ఉత్తరప్రదేశ్‌లోని    ముజఫర్ నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భర్తను చెట్టుకు కట్టేసి అతని కళ్ళెదుటే భార్యను నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ కు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది.

Uttar Pradesh : భర్తను చెట్టుకు కట్టేసి, వివాహితపై గ్యాంగ్ రేప్

Uttar Pradesh Gang Rape

Updated On : March 26, 2022 / 1:17 PM IST

Uttar Pradesh :  ఉత్తరప్రదేశ్‌లోని    ముజఫర్ నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భర్తను చెట్టుకు కట్టేసి అతని కళ్ళెదుటే భార్యను నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ కు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది.

న్యూమండీ   పోలీసులు అందించిన వివరాల ప్రకారం జిల్లాకు చెందిన ఒక వ్యక్తి బుధవారం రాత్రి తన భార్యను తీసుకుని అత్తమామల ఇంటి  వద్దకు వెళ్లి …ఇంటికి తిరిగి వెళుతున్నాడు. ఆ సమయంలో వారిని  10 మంది యువకులు అటకాయించారు.  దంపతులను సమీపంలోని మామిడి తోటలోకి తీసుకువెళ్ళారు.

అక్కడ భర్తను చెట్టకు కట్టేసి నలుగురు నిందితులు, మిగిలిన ఆరుగురి ముందు వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వారిని విడిచి పెట్టటంతో బాధితులు న్యూ మండి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
Also Read : Pending Cases : దేశంలో 4.70కోట్ల కేసులు పెండింగ్ : కేంద్రం
కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు విచారణలో భాగంగా ఇద్దరు మైనర్లతో సహా 10 మందిని అదుపులోకి తీసుకున్నట్టు ఎస్పీ అర్పిత్ విజయ్ వర్గీయ తెలిపారు.