Second Marriage : భార్య ఉండగానే మరో పెళ్లికి సిధ్దమైన వ్యక్తి అరెస్ట్
భార్య ఉండగానే మరో పెళ్ళి చేసుకునేందుకు సిధ్ధమైన వ్యక్తిని పోలీసులకు అప్పగించారు నూతన వధువు బంధువులు.

Muslim Marriage
Second Marriage : భార్య ఉండగానే మరో పెళ్ళి చేసుకునేందుకు సిధ్ధమైన వ్యక్తిని పోలీసులకు అప్పగించారు నూతన వధువు బంధువులు. హైదరాబాద్ పహాడిషరీఫ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ జావిద్ అనే వ్యక్తి భార్య పురుడు పోసుకునేందుకు పుట్టింటికి వెళ్లింది. జావిద్ కు మొదటి భార్య అంటే ఆసక్తి తగ్గిందో ఏమో మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.
భార్య పుట్టింటికి వెళ్లగానే సంబంధాలు చూసుకోవటం మొదలెట్టాడు. హైదరాబాద్ జగద్గిరిగుట్ట ప్రాంతానికి చెందిన ఒక యువతితో వివాహం ఖాయం చేసుకున్నాడు. జులై 25న ఆమెను పెళ్లిచేసుకోటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఈసంగతి తెలిసిన మొదటి భార్య కుటుంబీకులు కొత్త పెళ్లి కూతురు కుటుంబానికి జావిద్ సంగతి తెలిపారు.
దీంతో జావిద్ బండారం బట్టబయలవ్వడంతో.. కొత్త వధువు బంధువులు జావిద్‌ను ఇంటికి రమ్మని ఆహ్వానించారు. పెళ్లి వారు పిలుస్తున్నారనే ఉత్సాహంతో ఇంటికి వచ్చిన జావిద్‌ను పట్టుకుని పహాడిషరీఫ్ పోలీస్టేషన్‌లో అప్పగించి ఫిర్యాదు చేశారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.