Hyderabad prostitution : ఉద్యోగాల పేరుతో వ్యభిచార కూపంలోకి…

Hyderabad prostitution : ఉద్యోగాల పేరుతో వ్యభిచార కూపంలోకి…

Hyderabad Cops Arrested A Gang

Updated On : March 20, 2021 / 12:48 PM IST

Hyderabad prostitution : బతుకు తెరువుకోసం పొట్ట చేతపట్టుకుని భాగ్యనగరానికి వచ్చే ఒంటరి మహిళలను ట్రాప్ చేసి… వారికి మాయమాటలు చెప్పి…వ్యభిచార కూపంలోకి దింపుతున్న ముఠాను గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు.

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సతీష్‌(28), వరంగల్‌కు చెందిన సురేష్‌(19), తూర్పుగోదావరికి చెందిన పవన్‌(20)లతో పాటు అఖిల్‌, తేజ, చరణ్‌ అనే వారంతా కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఉద్యోగాల కోసం హైదరాబాద్ వచ్చే ఒంటరి మహిళలను గుర్తించేవారు. వారికి మాయ మాటలు చెప్పి వ్యభిచార కూపంలోకి దింపుతున్నారు.

ఢిల్లీకి చెందిన ఓయవతికి(19) హైదరాబాద్ లో ఉంటున్న మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ యువతి కోరిక మేరకు హైదరాబాద్ లో ఉద్యోగం ఇప్పిస్తా రమ్మనమని మహిళ చెప్పింది. ఆ యువతి ఢిల్లీ నుంచి హైదరాబాద్ రాగానే, మహిళ యువతిని సతీష్ కు పరిచయం చేసింది.

సతీష్ ఆమెకు ఉద్యోగం చూపించకపోగా…వ్యభిచారం చేయమని బలవంతం చేయసాగాడు. దీంతో ఆ మహిళ సతీష్ నుంచి తప్పించుకుని మార్చి 11న పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం సతీష్, సురేష్, పవన్ లను అరెస్ట్ చేయగా మహిళతో సహా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. పోలీసులు వారికోసం గాలిస్తున్నారు.