Hash Oil Sales Gang : హైదరాబాద్‌లో డ్రగ్స్ అమ్ముతున్న ఇద్దరి అరెస్ట్-5.5 లీటర్ల హాష్ ఆయిల్ స్వాధీనం
అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠాలను అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ పోలీసు కమీషనర్ అంజనీ కుమార్ తెలిపారు. వారి వద్దనుంచి ఐదున్నర లీటర్ల హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

Hyd Cp Anjani Kumar
Hash Oil Sales Gang : అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠాలను అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ పోలీసు కమీషనర్ అంజనీ కుమార్ తెలిపారు. వారి వద్దనుంచి ఐదున్నర లీటర్ల హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. దీని విలువ సుమారు రూ.25లక్షల వరకు ఉంటుందని ఆయన అన్నారు.
సంపత్ కిరణ్ కుమార్ అలియాస్ జాన్ అనేవ్యక్తిని అరెస్ట్ చేశామని అతని వద్దనుంచి 3.5 లీటర్ల హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ముఠాకు చెందిన మరోక వ్యక్తి పరారీలో ఉన్నాడని ఆయన చెప్పారు. ఈ కేసులో ప్రధాన ముద్దాయి అయిన జాన్ ఆంధ్రప్రదేశ్, పాడేరులో ఉన్న కొంత మంది డీలర్లు సహాయంతో గంజాయి నుండి హాష్ ఆయిల్ తీసి అమ్మకాలు చేస్తున్నాడు. ఒక గ్రామ్ ఆయిల్ ను 700 రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు.
వెస్ట్‌జోన్ పరిధిలో పాడేరుకు చెందిన గౌతమ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్దనుంచి 2 లీటర్ల హాష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసులో కూడా మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని తెలిపారు. ఇయర్ ఎండింగ్, నూతన సంవత్సర వేడుకలపై దృష్టి సారించామని…. పబ్స్‌లో మైనర్లకు మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు కమీషనర్ హెచ్చరించారు.
Also Read : Omicron In Telangana : ఒమిక్రాన్‌తో ప్రాణభయం లేదు.. 2 డోసులు వ్యాక్సిన్ తీసుకోండి: మంత్రి హరీష్
తల్లి తండ్రులుకూడా పిల్లలపై నిఘా పెట్టి మాదక ద్రవ్యాలు వాడకుండా చూడాలని ఆయన అంజనీ కుమార్ కోరారు. నగరంలో డ్రంక్ అండ్ డ్రయివ్ తనిఖీలు కొనసాగుతాయని… మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేస్తామని అంజనీ కుమార్ చెప్పారు.