Gutka Seized : హైదరాబాద్ లో కోటి రూపాయలు విలువైన నిషేధిత గుట్కా స్వాధీనం
హైదరాబాద్ నగరంలో రూ. కోటి విలువ చేసే నిషేధిత గుట్కా సీజ్ చేసినట్లు పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ చెప్పారు.

Gutka Seized
Gutka Seized : హైదరాబాద్ నగరంలో రూ. కోటి విలువ చేసే నిషేధిత గుట్కా సీజ్ చేసినట్లు పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ చెప్పారు. గుట్కా పట్టివేత కేసులో ముగ్గురిని అరెస్టు చేసామని … మరికోందరు పరారీలో ఉన్నారని ఆయన చెప్పారు.నిందితుల్లో ఇద్దరు కర్ణాటక వాసులు ఉన్నారని ఆయన తెలిపారు.
బేగం బజార్‌లో ఒకట్రాన్స్ పోర్టు కార్యాలయం వద్ద నిలిపి ఉంచిన లారీలో భారీగా గుట్కా నిల్వలు ఉన్నట్లు గుర్తించి దాడిచేశామని అన్నారు. గుట్కా విక్రయం ముఠాకు చెందిన కొంతమంది పరారీలో ఉన్నారని… నిందితులు నవ భారత్ రోడ్ లయన్స్ పేరుతో ట్రాన్స్ పోర్టు కార్యాలయం నిర్వహిస్తున్నారని కమీషనర్ చెప్పారు.
నిషేధిత గుట్కా, పేకాట, క్లబ్బులు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు కమీషనర్ హెచ్చరించారు. వీటి గురించి సమాచారం తెలిసిన ప్రజలు వాట్సాప్ ద్వారా 94906 16555 నంబర్‌కు సమాచారం ఇవ్వొచ్చని ఆయన సూచించారు.