Nigerian Drug Peddler : చదువు పేరుతో హైదరాబాద్ వచ్చి పాడు పని.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు

హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. పంజాగుట్ట జీవీకే దగ్గర డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ ను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు

Nigerian Drug Peddler : హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. పంజాగుట్ట జీవీకే దగ్గర డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ ను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని నైజీరియా దేశానికి చెందిన డానియల్ ఒలేరియా జోసఫ్ (33) గా గుర్తించారు. అతడు 2014లో స్టూడెంట్ వీసాపై హైదరాబాద్ నగరానికి వచ్చాడు. కూకట్ పల్లిలోని వివేకానంద డిగ్రీ కాలేజీలో చదువుకుంటుండగా ఢిల్లీకి చెందిన జాన్ పాల్ అనే నైజీరియన్ తో స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం మాదకద్రవ్యాల వ్యాపారానికి దారితీసింది. డ్రగ్స్ సప్లయర్ గా జోసఫ్ అవతారం ఎత్తాడు. వేరే చోటు నుంచి మాదకద్రవ్యాలు తెచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్నాయి.

Kangana Ranaut : నాగ చైతన్య – సమంత విడాకులు..అమీర్ ఖాన్ కారణమా ?

జీవీకే మాల్ దగ్గర డ్రగ్స్ ను విక్రయించేందుకు డానియల్ వస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు రంగంలోకి దిగారు. పకడ్బందీ ప్రణాళికతో డానియల్ ను అరెస్ట్ చేశారు. అతని నుంచి 4 గ్రాముల కొకైన్, హోండా యాక్టివా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

జోసెఫ్ కూడా డ్రగ్స్ కు బానిసగా మారాడు. ఈజీ మనీ కోసం డ్రగ్స్ సప్లయర్ గా మారాడు. హైదరాబాద్ నగరంలో మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నాడు. డ్రగ్స్ సరఫరా కేసులో గతంలో లంగర్ హౌజ్ పోలీసులు జోసఫ్ ను అరెస్ట్ చేశాడు. బెయిల్ పై బయటకు వచ్చాడు. అయినా అతడిలో మార్పు రాలేదు. జైలు నుంచి వచ్చార కూడా డ్రగ్స్ దందా కంటిన్యూ చేస్తున్నాడు. ఢిల్లీకి చెందిన జాన్ పాల్ సాయంతో డ్రగ్స్ తెప్పిస్తాడు. వాటిని హైదరాబాద్ లో విక్రయిస్తున్నాడు. గ్రాము కొకైన్ ను రూ.8వేల నుంచి రూ.10వేలకు అమ్ముతున్నట్టు పోలీసులు తెలిపారు.

Gangrene Disease : కరోనా బారిన పడినవారికి మరో ముప్పు

పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా నగరంలో డ్రగ్స్ దందాకు అడ్డుకట్ట పడటం లేదు. పోలీసుల కళ్లుగప్పి డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నారు. చదువు పేరుతో విదేశాల నుంచి వచ్చిన కొందరు యువతీ యువకులు నగరంలో మాదకద్రవ్యాల వ్యాపారం చేస్తున్నారు. వీసా గడువు ముగిసినా చట్ట విరుద్ధంగా ఇక్కడే ఉంటూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు