Gangrene Disease : కరోనా బారిన పడినవారికి మరో ముప్పు

కరోనా బారినపడి కోలుకున్నా దాని ప్రభావం నీడలా వెంటాడుతోంది. కరోనా బారిన పడినవారి పేగులకు ‘గ్యాంగ్రిన్‌’ సమస్య పొంచి ఉన్నట్టు తాజా పరిశీలనలో వెల్లడైంది.

Gangrene Disease : కరోనా బారిన పడినవారికి మరో ముప్పు

Corona

Updated On : October 3, 2021 / 1:46 PM IST

corona affected persons : ప్రపంచదేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. వైరస్ రూపాలు మార్చుకుంటూ దాడి చేస్తోంది. కరోనా బారినపడి కోలుకున్నా దాని ప్రభావం నీడలా వెంటాడుతోంది. కరోనా నుంచి కోలుకున్న వారు పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కరోనా బారిన పడినవారి పేగులకు ‘గ్యాంగ్రిన్‌’ సమస్య పొంచి ఉన్నట్టు తాజా పరిశీలనలో వెల్లడైంది. ఈ సమస్యను సకాలంలో గుర్తించకపోతే ప్రాణాలకే ముప్పు ఉంటుందని డాక్టర్లు అంటున్నారు.

హైదరాబాద్‌లోని నిమ్స్‌ హాస్పిటల్ లో చికిత్స పొందిన ఆరుగురు కరోనా బాధితుల్లో ఇటీవల ఈ రోగాన్ని గుర్తించినట్లు సర్జికల్‌ గ్యాస్ట్రో డిపార్ట్ మెంట్ అధికారి ప్రొఫెసర్‌ బీరప్ప పేర్కొన్నారు. సాధారణ రోగుల్లో కంటే కరోనా బారిన పడినవారిలోనే గ్యాంగ్రిన్‌ రోగం అధికంగా కనిపిస్తుందని, పేగులపై కూడా కరోనా వైరస్‌ ప్రభావం చూపడమే ఇందుకు ప్రధాన కారణమని ప్రొఫెసర్‌ బీరప్ప తెలిపారు.

Covid Symptoms : కరోనా బాధితుల్లో ముగ్గురిలో ఒకరికి కనీసం ఒక దీర్ఘకాలిక లక్షణం ఉంటోంది!

దీంతో పేగుల్లో రక్తం గడ్డకట్టి రక్తప్రసరణ నిలిచిపోతుందని, ఫలితంగా పేగులు చచ్చుబడిపోయి కుళ్లిపోతాయని తెలిపారు. తద్వారా జీర్ణ వ్యవస్థ దెబ్బతిని శరీరానికి శక్తి అందక రోగి మృత్యువాత పడే అవకాశాలున్నాయని వివరించారు.

ఇలాంటి లక్షణాలున్నవారు వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. గ్యాంగ్రిన్‌ రోగం బారిన పడి వారిలో ప్రధానంగా నాలుగు లక్షణాలను కలిగివుంటాయి. కడుపులో నొప్పి, నల్లరంగులో మలవిసర్జన, తరచూ వాంతులు, విరేచనాలు కలగడం వంటికి ప్రధాన లక్షణాలని నిపుణులు తెలిపారు.