Uppal Double Murder: ఉప్పల్ జంట హత్యల కేసులో కొత్త ట్విస్ట్ .. తండ్రీ కొడుకుల హత్యలకు క్షుద్రపూజలకు లింక్.!

ఉప్పల్ జంట హత్యల కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. తండ్రీ కొడుకుల హత్య హత్యలకు క్షుద్రపూజలకు లింక్ ఉన్నట్లుగా పోలీసులకు అనుమానిస్తున్నారు.

Uppal Double Murder: ఉప్పల్ జంట హత్యల కేసులో కొత్త ట్విస్ట్ .. తండ్రీ కొడుకుల హత్యలకు క్షుద్రపూజలకు లింక్.!

Uppal father and son muder case A new twist

Updated On : October 18, 2022 / 9:50 AM IST

Uppal Double Murder case : హైదరాబాద్‌లోని ఉప్పల్ లో జరిగిన జంట హత్య కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఉప్పల్ లోని హనుమాన్ లో జరిగిన తండ్రీకొడుకుల హత్యకు క్షుద్రపూజలకు సంబంధం ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు నర్శింహశర్మ పూజలు చేశాడని ఆ పూజల వల్లే తమ ఆరోగ్యం పాడైందనే అనుమానంతో కక్ష పెంచుకున్న నిందితులు తండ్రీ కొడుకులను హత్య చేసినట్లుగా తెలుస్తోంది. మృతుడు నర్శింహ పూజలు చేసి తమ ఆరోగ్యం..ఆర్థికంగా పాడైపోవటాని కి పూజలు చేశాడని భావించిన మామిడిపల్లికి చెందిన వినాయక్ రెడ్డి, సంతోష్ నగర్ కు చెందిన బాలకృష్ణారెడ్డిలు నర్శింహతో పాటు ఆయన కొడుకుని కూడా హత్య చేసినట్లుగా పోలీసులు గర్తించారు. హత్య జరిగిన ప్రాంతంలో బ్యాగ్ లో పసుపు,కుంకుమలు ఉన్నట్లుగా గుర్తించటంతో పోలీసులు ఈ దిశగా కేసు దర్యాప్తు చేయగా ఈ విషయం తెలిసింది. హత్యలు చేసి పరారైన నిందులను సెల్ టవర్ ఆధారంగా పోలీసులు గుర్తించి పట్టుకుని అరెస్ట్ చేశారు.

కాగా..నరసింహశర్మ ఇంటి వద్దే ఉంటూ తెలిసిన వ్యక్తులకు జాతకాలు, పంచాంగం చెబుతుంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ చాలా మంది జాతకాలు చెప్పించుకోవటానికి తమ ఇబ్బందులు చెప్పి పరిహారం తెలుసుకోవటానికి వచ్చి వెళ్తుంటారు. ఉదయం 5-6 గంటల సమయంలో ఎవరూ ఉండరని పక్కా రెక్కీ చేసి దారుణానికి పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం ఘటన జరగడానికి ముందు 5 గంటల ప్రాంతంలో పనిమనిషి వచ్చి నరసింహశర్మ ఇంట్లో పని చేస్తోంది. ఆ వెంటనే పూలమ్మే వ్యక్తి వచ్చాడు. పూలు ఇచ్చి తిరిగివెళ్లాక గేటు తెరిచే ఉంది. ఇదంతా గమనించిన దుండగులు వేగంగా ఇంట్లోకి ప్రవేశించి దారుణంగా హత్య చేశారు. తండ్రి కేకలు విని వచ్చిన కుమారుడు శ్రీనివాస్ వారిని అడ్డుకోగా అతనిపై కూడా దాడి చేయటంతో ఇద్దరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఈ జంటహత్యల కేసులో పోలీసులు 15 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి దర్యాప్తు చేస్తున్నారు. 30 మందిని విచారించిన పోలీసులు.. నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.అయితే.. పోలీసుల దర్యాప్తులో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. మృతుడు నరసింహశర్మ కుటుంబానికి శంషాబాద్‌లో ఎనిమిది ఎకరాల స్థలం ఉండగా.. ఆ భూమిపై వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ తండ్రీ కొడుకుల హత్యలకు ఆ భూ వివాదమే కారణం అయి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పలుకోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. వీలైనంత త్వరగా ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ హత్యలు చేయటానికి నిందితులు హత్య చేయడానికి ముందు వారం రోజులపాటు రెక్కి నిర్వహించి… ఆ తర్వాతే హత్యకు పాల్పడ్డినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇంతటి దారుణానికి పాల్పడినవారు ముగ్గురు సభ్యులు గల సుఫారీ గ్యాంగ్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల ఇంటి సమీపంలోని ఓ హాస్టల్‌లోనే నిందితులు బస చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మృతుడు నరసింహశర్మకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. ఒక కొడుకు శ్రీనివాస్ మూడు నెలల క్రితమే మలేషియా నుండి హైదరాబాద్‌కు వచ్చాడు. కాగా.. నిన్న ఉదయం పూజ పేరుతో ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు.. ఊహించని విధంగా ఒక్కసారిగా నరసింహశర్మపై కత్తితో దాడికి తెగబడ్డారు. తండ్రి అరుపులు, కేకలు విన్న శ్రీనివాస్.. బయటికి వచ్చి చూస్తే.. తన తండ్రిన విచక్షణారహింతంగా చంపుతున్న దృశ్యం చూశాడు. దుండగులను అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. శ్రీనివాస్‌ను కూడా కత్తితో పొడిచారు. ఈ దాడిలో నరసింహశర్మ, శ్రీనివాస్ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ హత్యకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో నిక్షిప్తం కాగా.. వాటిన ఆధారంగా చేసుకుని దర్యాప్తు కొనసాగించగా ఈ హత్యలకు క్షుద్రపూజలకు లింక్ ఉన్నట్లుగా పోలీసులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.