దొంగలపైకి పాములను వదిలి నిజం కక్కిస్తున్న పోలీసులు

దొంగలపైకి పాములను వదిలి నిజం కక్కిస్తున్న పోలీసులు

దొంగను పట్టుకుని చావబాదితేనో.. రకరకాలుగా హింసిస్తేనో నిజాలు బయటకొస్తాయని చాలా సార్లు విన్నాం. లై డిటెక్టర్‌తోనో, మత్తు మందు ఇచ్చో నిజాలు బయటపెట్టడం సినిమాల్లో చూశాం. కానీ, ఇక్కడ ఓ వింత పోకడ నమోదైంది. దొంగలను పట్టుకుని వారితో నిజం బయటపెట్టించడానికి పాములను వదులుతున్నాట. 

 

ఇండోనేషియాలోని పపువా ప్రాంతంలో పోలీసులు చేస్తున్న వింత వైఖరిపై విడుదలైన ఈ వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో.. మొబైల్ ఫోన్ దొంగిలించినట్లుగా అనుమానించిన వ్యక్తి చేతులను వెనుకకు కట్టేశారు. అతనిపైకి పామును వదిలడంతో మెడకు చుట్టుకుపోయింది. నిజం రాబట్టడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి పామును మొహం మీదకు పెట్టి కాసేపు భయపెట్టాడు.  అప్పటికీ ఆ వ్యక్తి నోరు మెదపకపోవడంతో చొక్కాలో వేసేందుకు ప్రయత్నించాడు. ఫ్యాంట్ లోనికి పోనివ్వాలనుకున్నాడు. అలా తన శాడిజాన్ని నిందితుడి మీద ప్రయోగించాడు. 

 

వైరల్ అయిన ఈ వీడియో పట్ల పై అధికారులు స్పందించారు. ఇన్వెస్టిగేషన్‌లో తమ పోలీసులు చేసిన తప్పుకు క్షమాపణలు చెప్పారు. జయావిజయా పోలీస్ స్టేషన్ ముఖ్య అధికారి టోనీ ఆనంద స్వదయ మాట్లాడుతూ.. ఇన్వెస్టిగేటర్‌ హుందాగా వ్యవహరించలేదు. అతనిపై చర్యలు తీసుకుంటాం. మరోసారి ఇలా పాములతో నిజాలు బయటపెట్టే పద్ధతి ప్రయోగించం’ అని స్పష్టం చేశారు.