విషాదం : ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్ లో విషాదం నెలకొంది. ఇంటర్మీడియట్ పరీక్షలో ఫెయిలైనందుకు మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

  • Published By: veegamteam ,Published On : April 19, 2019 / 03:40 AM IST
విషాదం : ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

Updated On : April 19, 2019 / 3:40 AM IST

హైదరాబాద్ లో విషాదం నెలకొంది. ఇంటర్మీడియట్ పరీక్షలో ఫెయిలైనందుకు మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

హైదరాబాద్ లో విషాదం నెలకొంది. ఇంటర్మీడియట్ పరీక్షలో ఫెయిలైనందుకు మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గాంధీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌ ప్రాంతానికి చెందిన గణేష్‌ కుమార్తె అనామిక(16) చాచానెహ్రునగర్‌లోని అమ్మమ్మ ఇంట్లో ఉంటుంది. ప్రగతి మహావిద్యాలయ కాలేజీలో ఇంటర్మీడియట్‌ సీఈసీ చదువుతోంది. 

గురువారం (ఏప్రిల్ 18, 2019) విడుదలైన ఇంటర్‌ ఫలితాల్లో ఆమె ఓ సబ్జెక్ట్ లో ఫెయిలయ్యింది. దీంతో మనస్తాపానికి గురైన అనామిక అదే రోజు సాయంత్రం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబీకుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఖర్చు ఎంతో తెలుసా?