Hyderabad : హైదరాబాద్ లో ఐసిస్ కలకలం…సానుభూతి పరుడు అరెస్ట్
హైదరాబాద్ పాతబస్తీలో ఐసిస్ కలకలం రేపుతోంది. ఐసిస్ తీవ్రవాదంపై సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వ్యక్తిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.

Ccs Police Station Hyderabad
Hyderabad : హైదరాబాద్ పాతబస్తీలో ఐసిస్ కలకలం రేపుతోంది. ఐసిస్ తీవ్రవాదంపై సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వ్యక్తిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అమెరికాకు వ్యతిరేకంగా హైదరాబాద్ నుంచి వెళ్లి యుద్ధం చేయాలని సులేమాన్ అనేవ్యక్తి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అతని ఐపీ అడ్రస్ ద్వారా మీర్ చౌక్ పోలీసుస్టేషన్ పరిధిలో సులేమాన్ ను అదుపులోకి తీసుకున్నారు.
గత కొన్నాళ్లుగా యువతను తీవ్రవాదం వైపు ఆకర్షించే విధంగా సులేమాన్ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. కాగా… 2002 లోనే పహడీ షరీఫ్ లో సులేమాన్ కు రాచకొండ ఎస్ఓటీ పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా అతని ప్రవర్తనలో ఎటువంటి మార్పురాలేదు. కొన్నాళ్ళు స్తబ్దుగా ఉన్న సులేమాన్ తరువాత ఫండింగ్ ఏర్పాటు చేసుకున్నాడు.
Also Read : Hyd Police : రాత్రి కలగంటాడు.. పగలు కొట్టేస్తాడు, 30 ఏళ్లుగా దొంగతనాలు
ప్రస్తుతం అతనికి ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చిందనే అంశంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. సోషల్ మీడియాలో 20 ఖాతాలను తెరిచిన సులేమాన్ యువతను ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు. హైదరాబాద్ పాతబస్తీలో ఉగ్రవాద కార్యకలాపాల అంశం మళ్లీ తెరమీదకు వచ్చేసరికి పోలీసులు అప్రమత్తం అయ్యారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికతో ఎన్ఐఏ, హైదరాబాద్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.