అర్థరాత్రి ప్రయాణాలు చేస్తున్నారా? బీకేర్ ఫుల్.. వెన్నులో వణుకు పుట్టించే వీడియో…
దీంతో కారులో ఉన్న రవి, అతడి కుటుంబసభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Family Chased (Photo Credit : Google)
Family Chased By Mob : అర్థరాత్రి ప్రయాణాలు చేసే వారు ఇకపై ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రాణాలు రిస్క్ లో పడినట్లే. ప్రమాదం ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తుందో తెలియని పరిస్థితి. ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటో.. ఓ ఐటీ ఉద్యోగి ఫ్యామిలీకి భయానక అనుభవం ఎదురైంది. అసలేం జరిగిందంటే.. పుణెకు చెందిన రవి కర్నానీ అనే ఐటీ ఉద్యోగి తన ఫ్యామిలీతో కలిసి కారులో వెళ్తున్నారు. అది అర్థరాత్రి సమయం. బాగా చీకటి పడింది.
లవాలే-నాందే రోడ్డులో కారులో వెళ్తున్నారు. ఇంతలో భయానక ఘటన ఎదురైంది. అల్లరి మూకలు సడెన్ గా రోడ్డుపై ప్రత్యక్షం అయ్యాయి. వారి కారుని ఆపేందుకు మూకలు దాడి చేశాయి. కొందరు యువకులు బైకులు, కార్లతో వెంబడించారు. వారి చేతిలో కర్రలు, రాడ్లు ఉన్నాయి. కారుని ఆపాలని వారు బెదిరించారు. ఐటీ ఉద్యోగి కారుని చాలాసేపు వెంబడించారు. దీంతో కారులో ఉన్న రవి, అతడి కుటుంబసభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రవి మాత్రం కారుని ఆపలేదు. అలాగే ముందుకు వెళ్లిపోయాడు. దీంతో వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ ఘటనతో రవి, అతడి కుటుంబసభ్యులు చాలా భయపడిపోయారు. రవి.. వేగంగా పోనీ.. అంటూ అతడి భార్య ఏడుస్తూ, భయపడుతూ చెప్పిన మాటలు వీడియోలో వినొచ్చు. తమకు ఎలాంటి ప్రమాదం జరక్కుండా చూడాలంటూ వారంతా దేవుడిని మొక్కుకున్నారు.
”వారంతా 40 మంది వరకు ఉన్నారు. వారి చేతుల్లో ఐరన్ రాడ్లు, కర్రలు, రాళ్లు ఉన్నాయి. బైక్, కారులో మా కారుని వారంతా వెంబడించారు. 80 కిలోమీటర్ల వేగంగా వారు మమ్మల్ని ఛేజ్ చేశారు. కానీ, నేను కారుని ఆపలేదు. చాలా భయమేసింది. ఏం జరుగుతుందో అర్థం కాలేదు” అని ఐటీ ఉద్యోగి రవి వాపోయారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా వారి నుంచి సరైన స్పందన రాలేదని బాధితుడు ఆరోపించాడు.
దీనిపై పోలీసుల వాదన భిన్నంగా ఉంది. వారు మూకలు కాదని, స్థానిక గ్రామస్తులు అని చెబుతున్నారు. దొంగతనాలు పెరిగిపోవడంతో గ్రామస్తులే రాత్రి వేళల్లో పెట్రోలింగ్ చేస్తుంటారని పోలీసులు అంటున్నారు. పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో రవి వెళ్తున్న కారుని ఆపి చెక్ చేసే ప్రయత్నం చేశారని, అయితే రవి కారు ఆపకపోవడంతో, వారు కారుని వెంబడించి దాడి చేశారని పోలీసులు వివరించారు. ఏది ఏమైనా దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
We were attacked !!!
There were total of 40 people in different pockets with Iron Rods, Stones and Sticks who were attacking our car, with 2 bikes and a car filled with Local goons chasing us at a speed of 80kmpl !!!
The local Police took their side stating they were patrolling pic.twitter.com/YVlUJlmdLY
— Ravi Karnani (@_ravi_karnani) September 30, 2024