Jio Fiber రిజిస్ట్రేషన్ : E-mail యాక్టివేషన్ స్కామ్!
డేటా సంచలనం రిలయన్స్ జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసు సెప్టెంబర్ 5న అధికారికంగా లాంచ్ కానుంది

డేటా సంచలనం రిలయన్స్ జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసు సెప్టెంబర్ 5న అధికారికంగా లాంచ్ కానుంది
డేటా సంచలనం రిలయన్స్ జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసు సెప్టెంబర్ 5న అధికారికంగా లాంచ్ కానుంది. ఆగస్టు 12న రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ జియో ఫైబర్ సర్వీసును ప్రకటించిన సంగతి తెలిసిందే. డిజిటల్ రంగంలో విప్లవాన్ని సృష్టించిన జియో ఆఫర్లు, డేటా ప్లాన్లపై భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. జియో ఫైబర్ రిజిస్ట్రేషన్లపై ఓ ఈమెయిల్ సర్య్కూలేట్ అవుతోంది. ఆన్ లైన్ మోసగాళ్లు వినియోగదారులను బురిడీ కొట్టించేందుకు జియో రిజిస్ట్రేషన్లపై సస్పెక్ట్ ఈమెయిల్ ను ఇంజెక్ట్ చేస్తున్నారు.
జియో ఫైబర్ రిజిస్ట్రేషన్ కోసం ఈమెయిల్ యాక్టివేషన్ చేసుకోవాల్సి ఉందని, అందుకు వినియోదారులు తమ బ్యాంకు వివరాలు చెప్పాల్సిందిగా అడుగుతున్నారు. ఇదో పెద్ద స్కామ్ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జియో ఫైబర్ సబ్ స్ర్కిప్షన్ పేరుతో వినియోగదారుల బ్యాంకు వివరాలను తెలుసుకునేందుకు సైబర్ నేరగాళ్లు ఈ ట్రిక్ వాడుతున్నారట. ముందుగా జియో యూజర్లకు ఒక ఈమెయిల్ యాక్టివేషన్ లింక్ పంపుతున్నారు. అదో ఫిషింగ్ (మాల్ వేర్ వైరస్) లింక్. అందులో గిగాఫైబర్ యాక్టివేషన్ రిక్వెస్ట్ రీసివుడ్ అని క్లిక్ బటన్ ఉంటుంది.
ఈ లింక్ ఓపెన్ చేయొద్దు. ఈ లింక్ క్లిక్ చేయగానే ఒక సైటుకు రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ వినియోదారుడి వ్యక్తిగత వివరాలు, బ్యాంకు వివరాలను అడుగుతుంది. అది నమ్మి మీ బ్యాంకు వివరాలు ఎంటర్ చేస్తే.. స్కామర్లు మీ డేటాను హ్యాక్ చేసి డబ్బులు కాజేస్తారు జాగ్రత్త. అదో ఫేక్ వెబ్ సైట్.. అచ్చం ఒరిజినల్ జియో సైటు మాదిరిగానే రంగులు, ఫాంట్లతో కనిపిస్తుంది. అది చూసి నమ్మొద్దు. విలువైన నగదును కోల్పోవద్దు అని ఐటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఈమెయిల్ యాక్టివేషన్ రిక్వెస్ట్ సంబంధించి రిలయన్స్ జియో కూడా అలర్ట్ చేస్తోంది. జియో యూజర్లను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.
జియో ఫైబర్ సబ్ స్ర్కిప్షన్ ప్రాసెస్ ఇలా :
* కస్టమర్లు గుర్తించాల్సిన విషయం.. రిలయన్స్ జియో తమ కస్టమర్ల వ్యక్తిగత వివరాలను అడగదు
* జియో ఫైబర్ సబ్ స్ర్కిప్షన్ ప్రాసెస్ కోసం బ్యాంకు వివరాలను ఎట్టి పరిస్థితుల్లో కంపెనీ అడగదు.
* జియో ఫైబర్ కొత్త కనెక్షన్ కావాలంటే యూజర్లు జియో వెబ్ సైట్లో రిజిస్ట్రర్ అవ్వాల్సి ఉంటుంది.
* జియో ఫైబర్ వెబ్ సైట్ విజిట్ అవ్వాల్సి ఉంటుంది.
* కనెక్షన్ తీసుకునే యూజర్ ఏ ప్రాంతంలో ఉంటున్నాడు. ఏ టౌన్ షిప్ లేదా సొసైటీనో నిర్ధారించుకోవాలి.
* ఏ లొకేషన్ లో కావాలో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
* మీరు నివసించే ఇంటి అడ్రస్ తో పాటు ఈమెయిల్, పేరు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
* వెరిఫికేషన్ కోసం మీ రిజిస్ట్రర్డ్ మొబైల్ కు OTP వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి.
* వెరిఫికేషన్ పూర్తి కాగానే.. సైట్లో మెసేజ్ వస్తుంది.. తదుపరి ప్రాసెస్ కోసం కంపెనీ ఇంజినీర్లు కాంటాక్టు అవుతారు.
* ఆ తర్వాత మీరు ఉండే ప్రాంతంలో జియో ఫైబర్ అందుబాటులో ఉందో చెక్ చేసి ఫైనల్ కనెక్షన్ అందిస్తారు.
జియో ఫైబర్ సర్వీసు ద్వారా యూజర్లకు ఎన్నో బెనిఫెట్స్ అఫర్ చేస్తోంది. 4G మార్కెట్ మాదిరిగా ఫిక్స్‌డ్ లైన్ బ్రాడ్ బ్యాండ్ మార్కెట్ తీసుకురాబోతోంది. జియో ఫైబర్ అందించే చౌకైన డేటా ప్లాన్లలో నెలకు ప్రారంభ ధర రూ.700 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ పై కనీసం 100Mbps స్పీడ్ అందించనుంది. మరో హైస్పీడ్ ప్రీమియం ప్లాన్ రూ.10వేలు.. దీనిపై 1Gbps హైస్పీడ్ ఇంటర్నెట్ పొందవచ్చు.