Jubilee Hills Gang Rape Case : గ్యాంగ్‌రేప్ కేసు విచారణలో వెలుగు చూస్తున్న కీలక విషయాలు

జూబ్లీ‌హిల్స్ మైనర్ బాలిక రేప్ కేసులో నిందితులు ఐదుగురిని ఈరోజు పోలీసులు విచారించనున్నారు. ఇప్పటికే ఏ1 నిందితుడు సాదుద్దీన్ మాలిక్ (18) నుంచి కీలక సమాచారం రాబట్టిన పోలీసులు ఈ రోజు మిగిలిన నిందితులను విచారించనున్నారు.

Jubilee Hills Gang Rape Case : గ్యాంగ్‌రేప్ కేసు విచారణలో వెలుగు చూస్తున్న కీలక విషయాలు

Jubilee Hills Gang Rape case

Updated On : June 14, 2022 / 9:48 AM IST

Jubilee Hills Gang Rape Case :  జూబ్లీ‌హిల్స్ మైనర్ బాలిక రేప్ కేసులో నిందితులు ఐదుగురిని ఈరోజు పోలీసులు విచారించనున్నారు. ఇప్పటికే ఏ1 నిందితుడు సాదుద్దీన్ మాలిక్ (18) నుంచి కీలక సమాచారం రాబట్టిన పోలీసులు ఈ రోజు మిగిలిన నిందితులను విచారించనున్నారు.

ఇప్పటికే జరిగిన మూడు  రోజుల్లో విచారణాధికారికి ఐదుగురు మైనర్ నిందితులు పలు వివరాలు చెప్పి నేరం ఒప్పుకున్నారు. నాలుగో రోజైన నేడు సాదుద్దీన్ ఇచ్చిన వాంగ్మూలంతో మిగిలిన ఐదుగురిని పోలీసులు విచారించనున్నారు. సామూహిక అత్యాచారం అనంతరం పబ్ బేస్‍‌మెంట్‌లో బాలికను మళ్లీ వేధించినట్లు నిందితులు ఒప్పుకున్నారు.

పోలీసులకు లభించిన సీసీటీపీ ఫటేజిలో ఈదృశ్యాలు ఉన్నాయి. ఆరుగురు నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత బాలిక తండ్రి ఆమెను అక్కడి నుంచి తీసుకువెళ్లినట్లు నిందితులు తెలిపారు. కాగా… ఈకేసులో సాదుద్దీన్ మినహా మిగిలిన వారంతా మైనర్లే అని, వారికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్స్ పూర్తి ఆధారాలు సేకరించామని పోలీసు అధికారులు వివరించారు.

Also Read : Condoms Expensive : వామ్మో.. ఒక కండోమ్ ప్యాకెట్ ధర రూ.60వేలు.. ఎందుకంత రేటు అంటే