పార్టీకి పిలిచి…స్నేహితుడి భార్యపై అత్యాచారం చేసిన ఆర్మీ కల్నల్

  • Published By: murthy ,Published On : December 14, 2020 / 11:57 AM IST
పార్టీకి పిలిచి…స్నేహితుడి భార్యపై అత్యాచారం చేసిన ఆర్మీ కల్నల్

Updated On : December 14, 2020 / 12:06 PM IST

Army Colonel Allegedly Raped Friend’s Wife : ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ లో దారుణం జరిగింది. తనకు ప్రమోషన్ రావటంతో స్నేహితుడిని పార్టీకి పిలిచిన ఆర్మీ ఆధికారి… ఆ సమయంలో స్నేహితుడి భార్యపై అత్యాచారం చేశాడు. కంటోన్మెంట్ పరిధిలో ఆదివారం రాత్రి ఈ దారుణం జరిగింది.

ఆర్మీలో లెఫ్టినెంట్ హోదాలో పనిచేసే ఒక ఉద్యోగికి ప్రమోషన్ వచ్చి కల్నల్ గా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా ఆదివారం డిసెంబర్ 13న తన స్నేహితుడితో పాటు అతని భార్యను డిన్నర్ కు పిలిచాడు. ఇక భార్యా భర్తలిద్దరూ విందుకు వెళ్లారు. అక్కడకు వెళ్లిన తర్వాత ఆర్మీ ఉద్యోగి ఇద్దరికి మత్తు పానీయాలు ఇచ్చాడు. అవి తాగిన తర్వాత ఇద్దరూ అపస్మారక స్ధితిలోకి చేరుకున్నారు.

ఆ సమయంలో స్నేహితుడి భార్యపై ఆర్మీ ఉద్యోగి అత్యాచారం చేసాడు. తెలివి తెచ్చుకుని స్నేహితుడి భార్య ప్రతిఘటించగా కల్నల్ ఆమెను కొట్టి అత్యాచారం చేశాడు. కొంత సేపటికి తెలివిలోకి వచ్చిన కల్నల్ స్నేహితుడు జరిగిన దారుణం గ్రహించి కాన్పూర్ కంటోన్మెంట్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

నిందితుడిపై ఐపీసీ లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ రాజ్ కుమార్ అగర్వాల్ తెలిపారు. బాధితురాలు రష్యన్ సంతతికి చెందిన మహిళ . గత 10 ఏళ్లుగా భారతదేశంలో నివసిస్తోంది. పరారీలో ఉన్న కల్నల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.