రెండో భార్యతో మొదటి భార్య కొడుకు అక్రమ సంబంధం … విద్యాసంస్థల అధినేత హత్య

  • Published By: chvmurthy ,Published On : March 2, 2020 / 06:05 PM IST
రెండో భార్యతో మొదటి భార్య కొడుకు అక్రమ సంబంధం … విద్యాసంస్థల అధినేత హత్య

Updated On : March 2, 2020 / 6:05 PM IST

కొన్ని చట్టాల ప్రకారం భర్త తదనంతర ఆస్తి భార్యకి…. తండ్రి తదనంతరం ఆస్తి కొడుక్కి వస్తుంది. కానీ… ఆస్తి సంపాదించటం కోసం ఎంతటి దారుణానికైనా పాల్పడుతున్నారు ప్రజలు. అందులో వావి వరసలు కూడా మర్చిపోయి అక్రమ సంబంధాలు పెట్టుకుని నేరాలు చేసేస్తున్నారు.  

ఇలాంటి అక్రమ సంబంధాలతో కర్ణాటకలోని ఒక విద్యాసంస్ధల అధినేత  హత్యకు గురయ్యారు. పేరు పొందిన విద్యా సంస్ధల అధినేత కాబట్టి వ్యాపారంలో ప్రత్యర్ధి వర్గం వారే  హత్య చేయించిఉంటారనుకున్న పోలీసులకు విచారణలో దిమ్మ తిరిగే నిజాలు తెలిసాయి.

మొదటి భార్య కుమారుడు, రెండో భార్య మధ్య ఏర్పడిన అక్రమ సంబంధం ఆ వ్యాపారవేత్తను బలి తీసుకుంది. కేసు ఇన్వెస్ట్ గేట్ చేసిన పోలీసులు ప్రధాన నిందితులైన రెండోభార్యను, మొదటి భార్య కొడుకుతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు.

bangalore murder 1

కర్ణాటక లోని విజయపురా జిల్లాలోని బసవన బాగేవాడిలో గల మడివాళేశ్వర గ్రూప్ విద్యాసంస్ధల అధినేత దామూ నాయక్ ను ఫిబ్రవరి 25న  హంతుకులు గొంతుకోసి హత్య చేశారు.  విద్యాసంస్థల అధినేత కావటంతో ఈ వార్త జిల్లాలో సంచలనం సృష్టించింది.  పోలీసు యంత్రాంగం  ఈ ఘటనపై ప్రత్యేక దృష్టి పెట్టి మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించింది. హంతకుల కోసం విస్తృతంగా గాలించారు. 

prema naik

పాత కక్షల కారణంగానే దామునాయక్  హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానించారు. ఆ కోణంలో దర్యాప్తు కొనసాగించారు.  ఆయనతో శతృత్వం ఉన్నవారందరినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. 12 మందిని విచారించినప్పటికీ ఎటువంటి క్లూ లభించలేదు. ఇక పోలీసులు దృష్టి కుటుంబ  సభ్యులపై పడింది. దాము నాయక్ కు పెద్ద ఎత్తున ఆస్తులు ఉండటం… రెండు పెళ్లిళ్లు చేసుకోవటం గుర్తించారు. ఈ కోణంలో విచారణ మొదలెట్టిన పోలీసులకు అసలు విషయం  తెలిసింది.  

దామూ నాయక్-విద్యాసంస్ధల అధినేత 

daamu naik

మొదటి భార్య కుమారుడు సుభాష్ నాయక్,  రెండో భార్య ప్రేమ మధ్య ఏర్పడిన అక్రమ సంబంధం  ఈ దారుణ  హత్యకు దారితీసిందని గుర్తించారు. దామూ నాయక్ ను అడ్డుతొలగించుకుంటే కోట్లాది రూపాయలు ఆస్తి తమ సొంతం అవుతుందని భావించిన నిందితులు ఇద్దరు ….ముగ్గురు వ్యక్తులకు సుపారీ ఇచ్చి హత్య చేయించారని జిల్లా పోలీసు సూపరింటెండెంట్  అనుపమ అగర్వాల్ చెప్పారు. 
 

సుభాష్ నాయక్, ప్రేమ, లతో పాటు అశోక్ లమాణి, అవ్వణ్ణ గ్వాతగి, శివణ్ణ కొణ్ణూర్ లను అరెస్టు చేశారు. సెల్ ఫోన్ కాల్ లిస్టు ఆధారంగా  నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.