Korulta Girl Case: మర్డర్ ఎలా చేయాలో యూట్యూబ్ లో వీడియోలు చూసింది.. చిన్నారి హితిక్ష కేసులో వెలుగులోకి చిన్నమ్మ క్రూరత్వం
పోలీసుల విచారణలో విస్తుపోయే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. తోటికోడలిపై అసూయ, కోపంతో మమత ఎంత క్రూరంగా మారిందో ఎంక్వైరీలో బయటకు వచ్చింది.

Korulta Girl Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన జగిత్యాల జిల్లా కోరుట్ల చిన్నారి హితిక్ష హత్య కేసులో మిస్టరీ వీడింది. పాప చిన్నమ్మే హంతకురాలిగా తేలింది. ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకున్న ఈ మర్డర్ కేసులో.. చిన్నమ్మే చిన్నారిని చంపిందని పోలీసులు నిర్ధారించుకున్నారు. చిన్నమ్మే పాపను ఎందుకు చంపింది? పాపం ఏం చేసింది? అభంశుభం తెలియని చిన్నారిపై ఎందుకంత కక్ష పెంచుకుంది? అనే వివరాలను పోలీసులు వెల్లడించారు. విచారణలో చిన్నమ్మ మమత క్రూరత్వం గురించి తెలుసుకుని పోలీసులే షాక్ అయ్యారు.
బిట్ కాయిన్ లో 30 లక్షలు పెట్టుబడి పెట్టి లాస్ అయ్యింది మమత. ఈ విషయంలో మమతను చిన్నచూపు చూసి హేళన చేసిందని తోటికోడలిపై కోపం పెంచుకుంది. తోటికోడలిపై అసూయ, కోపంతోనే ఆమె కూతురిని చంపేసింది మమత. బాలిక చిన్నమ్మ మమత ఆన్ లైన్ గేమ్స్ తో పాటు బిట్ కాయిన్ లో పెట్టుబడులు పెట్టి 25లక్షలు పోగొట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
డబ్బులు పోగొట్టుకోవడంతో ఇంట్లో తనను చిన్నచూపు చూస్తున్నారని, తన తోటికోడలు నవీనపై మమత కక్ష పెంచుకుంది. నవీన కూతురు హితిక్షను హత్య చేసినట్లుగా పోలీసులు చెప్పారు. హత్య కోసం వాడిన పరికరాలతో పాటు ఆమె వేసుకున్న దుస్తులను పట్టణ శివారులోని ఓ ఫంక్షన్ హాల్ దగ్గర పోలీసులు సేకరించారు.
Also Read: అమెరికాలో ఘోరం.. హైదరాబాద్ కుటుంబం సజీవ దహనం.. మృతుల్లో ఇద్దరు పిల్లలు
పోలీసుల విచారణలో విస్తుపోయే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. తోటికోడలిపై అసూయ, కోపంతో మమత ఎంత క్రూరంగా మారిందో ఎంక్వైరీలో బయటకు వచ్చింది. తోటికోడలి కుటుంబంలో విషాదం నింపాలని ఎప్పటి నుంచో చూస్తున్న మమత.. హత్యను ఎలా చేయాలో యూట్యూబ్ వీడియోలను చూసింది. సమయం కోసం ఎదురుచూసింది. పక్కా ప్రణాళికతో ఐదేళ్ల చిన్నారి హితిక్షను హతమార్చింది. అంతేకాదు పాప సోదరుడిని కూడా త్వరలోనే చంపాలని ప్లాన్ చేసుకుంది. కానీ పోలీసుల విచారణలో మమత దొరికిపోయింది.