Mallareddy : గిరిజనుల భూములు కబ్జా చేశారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు

గిరిజనుల భూములు కబ్జా చేశారంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై కేసు నమోదైంది.

Mallareddy : గిరిజనుల భూములు కబ్జా చేశారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు

Updated On : December 13, 2023 / 7:37 PM IST

case registered against mallareddy : మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై కేసు నమోదు అయ్యింది. గిరిజనులకు సంబంధించిన 47 ఎకరాల భూమిని మల్లారెడ్డి కబ్జా చేశారంటూ శామీర్‌పేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మల్లారెడ్డిపై వచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మల్లారెడ్డిపై ఎస్సీ, ఎస్టి, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రే అక్రమంగా గిరిజనులకు సంబంధించిన భూములు రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపిస్తు ఫిర్యాదు చేశారు. ఎమ్మార్వోతో పాటు మల్లారెడ్డిపై ఫిర్యాదు అందటంతో పోలీసులు నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

కాగా..గతంలో కూడా మల్లారెడ్డిపై భూకబ్జా ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి కేసులు కూడా నమోదయ్యాయి. ఈక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఓటమిపాలయ్యాక మరోసారి భూకబ్జా ఆరోపణలో కేసు నమోదు కావటం గమనించాల్సిన విషయం. ఈ ఎన్నికల్లో మల్లారెడ్డి మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన విషయం తెలిసిందే.

Also Read: బీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగున్నర లక్షల కోట్లు అప్పులు చేసింది- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి