సోదరుడే చంపేశాడు: చనిపోయిన మహిళ తిరిగొచ్చింది

సోదరుడే చంపేశాడు: చనిపోయిన మహిళ తిరిగొచ్చింది

ఓ మనిషి చనిపోయిందని సర్టిఫికేట్ల సాక్షిగా నిరూపితమైన తర్వాత మళ్లీ ఆఫీసుకు రావడంతో ఆ స్టాఫ్ మొత్తం షాక్ కు గురైయ్యారు. తాను అసలు చనిపోలేదంటూ ఆ యువతి మొరపెట్టుకోవడంతో నిజాలు బయటికొచ్చాయి. మహారాష్ట్రలోని వెయ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. 
Read Also: కత్తితో నరికారు : వివేకానందరెడ్డిని చంపేశారు

మాస్వే తాలూఖాకు చెందిన రంగూభాయి జగన్నాథ్ శ్రికే అనే ఓ మహిళ ఎల్ఐసీ ప్రీమియం కడుతుంది. రూల్స్ ప్రకారం నామినేషన్ గా ఎవర్నో ఒకర్ని ఉంచాలని చెప్పడంతో మందర్దియోలో నివాసముంటున్న సోదరుడు ప్రకాశ్ శ్రీపాఠి మంద్రే పేరు ఇచ్చింది. 

అదే అవకాశంగా భావించిన ప్రకాశ్.. వేరే వ్యక్తి అజయ్‌తో కలిసి డెత్ సర్టిఫికేట్ రెడీ చేశారు. అనుకున్నదే తడవుగా ఎల్ఐసీ ఆఫీసుకు వెళ్లి ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అప్లై చేశాడు. అదింకా ప్రొసెసింగ్‌లో ఉండగానే, వాయిదా డబ్బులు కట్టేందుకు రంగూభాయి(సర్టిఫికేట్ ప్రకారం మృతి చెందిన మహిళ) ఆఫీసుకు వచ్చింది. ఆమెను చూసి ఆఫీసులో వారంతా షాక్‌కు గురయ్యారు. తర్వాత ఆమె ఇచ్చిన వివరణను బట్టి నామినీ వ్యక్తే ఈ మోసానికి పాల్పడ్డట్లూ గుర్తించాడు. 

ఎల్ఐసీ అధికారి ప్రకాశ్ జగన్నాథ్ చాంబ్రే ఫిర్యాదు మేరకు క్రిమినల్ కంప్లైట్ నమోదు చేశారు. ప్రకాశ్.. అజయ్ ఇళ్లలో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు పరారీలో ఉన్నట్లు తేలింది. త్వరలో పట్టుకుంటామని వెయ్ జిల్లా పోలీసు అధికారులు తెలిపారు. 
Read Also: అక్కడ ఎంపీని డిసైడ్ చేసేది మహిళలే