Ibrahimpatnam VTPS : ఇబ్రహీంపట్నం వీటీపీఎస్ లో ప్రమాదం.. వైర్ తెగి కింద పడ్డ లిఫ్ట్, ఇద్దరు మృతి

ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం వీటీపీఎస్ లో ప్రమాదం జరిగింది. వైర్ తెగి లిఫ్ట్ కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఐదు మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.

VTPS

Ibrahimpatnam VTPS : ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం వీటీపీఎస్ లో ప్రమాదం జరిగింది. డాక్టర్ నార్ల తాతారావు ధర్మల్ పవర్ స్టేషన్ లోని 16వ అంతస్తు నుండి లిఫ్ట్ జారీ కింద గట్టిగా కొట్టుకుని మరల ఆరో అంతస్తు వరకు వెళ్లి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఆరు మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఎనిమిది మంది లిఫ్ట్ లో పైకి వెళుతుండగా వైర్ తెగడంతో లిఫ్ట్ అమాంతం కిందికి ఊడి పడింది. దీంతో లిఫ్ట్ లో ఉన్న ఎనిమిది మందిలో ఇద్దరు మృతి చెందారు. మరో 6 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

వియవాడ సమీపంలో ఉన్న వీటీపీఎస్ లో వైర్ తెగి పడటంతో లిఫ్ట్ కింద పడిపోయింది. దీంతో లిఫ్ట్ లో ఉన్న 8 మంది కార్మికులు ఒక్కసారిగా కింద పడిపోయారు. లిఫ్ట్ లో ఉన్న ఎనిమిది మందిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా ఆరుగురిని చికిత్స కోసం దగ్గర్లో ఉన్న స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ఇబ్రహీంపట్నం వీటీపీఎస్ లో ప్రతి రోజు ఉదయం లిఫ్ట్ ద్వారా కార్మికులు పైకెళ్లి పనులు చేస్తుంటారు.

నెల్లూరు జిల్లా ‘షార్’ కేంద్రంలో విషాదం…లిఫ్ట్ ప్రమాదంలో మహిళా ఉద్యోగిని మృతి

ప్రతి రోజూలాగే ఇవాళ (శనివారం) కూడా కార్మికులు లిఫ్ట్ లో వెళ్తుండగా కొంత దూరం పైకి వెళ్లిన తర్వాత వైర్ తెగి పోవడంతో లిఫ్ట్ అమాంతం కింద పడిపోయింది. లిఫ్ట్ కింద పడటం, కుదుపులకు అందులో ఉన్న 8 మంది కార్మికుల్లో ఇద్దరు  అక్కడికక్కడే చనిపోయారు. మరో ఆరు మంది కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగున వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

డాక్టర్ నార్ల తాతారావు ధర్మల్ పవర్ స్టేషన్ లోని 16వ అంతస్తు నుండి లిఫ్ట్ జారీ కింద గట్టిగా కొట్టుకుని మరల ఆరో అంతస్తు వరకు వెళ్లి కింద పడిపోవటంతో లిఫ్ట్ లో ఉన్న ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు జార్ఖండ్ కు చెందిన కార్మికులు మృతి చెందారు. సరైన సేఫ్టీ లేకపోవడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని కార్మికులు ఆందోళన చేపట్టారు. తమకు ఎటువంటి సేఫ్టీ లేకుండా పనిచేయటం వల్లనే ఇవాళ శనివారం ఇద్దరు వ్యక్తులు మృతి చెందారని కార్మికులు ఆరోపించారు. మృతి చెందిన ఇద్దరు వ్యక్తులను తమకు తెలియకుండానే బయటకు పంపేయటంపై కార్మికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

విషాదం : లిఫ్ట్ రాకముందే లోపలికి వెళ్లి యువకుడు మృతి

చనిపోయిన ఇద్దరు వ్యక్తులను ఇక్కడికి తీసుకువచ్చేంతవరకు ఇక్కడి నుండి కదిలే ప్రసక్తి లేదని కార్మికులు ఆందోళన చేపట్టారు. ఇబ్రహీంపట్నం పోలీసులు కార్మికులను నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం పోలీసులు కార్మికులకు అండగా నిలబడ్డారు.  సంఘటన జరిగి గంటలు గడుస్తున్నా ఏ అధికారి కూడా సంఘటనా స్థలానికి చేరుకోకపోవడంతో కార్మికులు ఆందోళన చేపట్టారు.

పదే పదే సంబంధిత అధికారులకు పోలీసులు సమాచారం ఇస్తున్నారు. ఇక్కడకు అధికారులు వస్తే సమస్య పరిష్కారం అవుతుందంటూ చెప్పినప్పటికీ ఇదిగో అదిగో అంటూ వీటీపీఎస్ యాజమాన్యం కాలక్షేపం చేస్తోంది. కార్మికుల వద్దకు వచ్చి సమాధానం చెబితే గొడవ జరగకుండా ఉంటుందంటూ పోలీసులు వీటిపిఎస్ అధికారులను ప్రాధేయపడుతున్నప్పటికీ పట్టించుకోని వైనం చోటు చేసుకుంది.