నెల్లూరు జిల్లా ‘షార్’ కేంద్రంలో విషాదం…లిఫ్ట్ ప్రమాదంలో మహిళా ఉద్యోగిని మృతి

నెల్లూరు జిల్లా ‘షార్’ కేంద్రంలో విషాదం…లిఫ్ట్ ప్రమాదంలో మహిళా ఉద్యోగిని మృతి

Updated On : December 31, 2020 / 12:27 PM IST

SHAR woman employee killed in lift accident : నెల్లూరు జిల్లా షార్ కేంద్రంలో తీవ్ర విషాదం నెలకొంది. లిఫ్ట్ ప్రమాదంలో షార్ మహిళా ఉద్యోగిని మృతి చెందారు. తిరుపతి.. కొర్లగుంటలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన జరిగింది. లిఫ్ట్ రాక ముందే ఫోర్త్ ఫ్లోర్ లో లిఫ్ట్ బాక్స్ గేట్లు తెరుచుకున్నాయి.

అయితే వెలుతురు లేక పోవడంతో సరిగ్గా చూడకుండా ఉద్యోగిని వాసంతి లోపల కాలు పెట్టారు. అకస్మాత్తుగా కిందపడిన ఉద్యోగిని వాసంతి అక్కడికక్కడే మృతి చెందారు. భవన యజమాని నిర్లక్ష్యం వల్లే తన భార్య మరణించిందని మృతురాలి భర్త సురేంద్ర రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.