విషాదం : లిఫ్ట్ రాకముందే లోపలికి వెళ్లి యువకుడు మృతి

విజయవాడలోని గవర్నర్ పేటలో విషాదం చోటు చేసుకుంది. అపార్టుమెంట్ లిఫ్ట్ రాకముందే లోపలికి వెళ్లి కిందపడి యువకుడు మృతి చెందారు.

  • Published By: veegamteam ,Published On : November 12, 2019 / 07:38 AM IST
విషాదం : లిఫ్ట్ రాకముందే లోపలికి వెళ్లి యువకుడు మృతి

Updated On : November 12, 2019 / 7:38 AM IST

విజయవాడలోని గవర్నర్ పేటలో విషాదం చోటు చేసుకుంది. అపార్టుమెంట్ లిఫ్ట్ రాకముందే లోపలికి వెళ్లి కిందపడి యువకుడు మృతి చెందారు.

విజయవాడలోని గవర్నర్ పేటలో విషాదం చోటు చేసుకుంది. అపార్టుమెంట్ లిఫ్ట్ రాకముందే లోపలికి వెళ్లి కిందపడి యువకుడు మృతి చెందారు. బందరు రోడ్డులోని ఓ అపార్ట్ మెంట్ లో షేక్ ఇర్ఫాన్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. మంగళవారం (నవంబర్ 12, 2019) ఉదయం కిందికి వెళ్లేందుకు లిఫ్ట్ దగ్గరికి వచ్చి బటన్ నొక్కాడు. వెంటనే ద్వారం తెరచుకుంది. 

అయితే అప్పటికి లిఫ్ట్ ఆ ఫ్లోర్ కు రాలేదు. ఆ విషయాన్ని గమనించని ఇర్ఫాన్ లోపలికి అడుగు పెట్టాడు. దీంతో లిఫ్ట్ రూమ్ లోపల ఐదో అంతస్తు నుంచి కిందపడ్డారు. తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. యువకుని మృతితో అపార్ట్ మెంట్ లో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

సాంకేతిక కారణంతో ప్రమాదం జరిగిందా.. ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ ఫుటేజ్‌ను కూడా పరిశీలిస్తున్నారు. లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉండగానే ఐదో ఫ్లోర్‌లో డోర్ ఎలా తెరుచుకుందన్నది తేలాల్సి ఉంది.