దిశ లివర్ లో మద్యం ఆనవాళ్లు : పోలీసుల చేతికి మరో కీలక ఆధారం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో.. సంచలన నిజాలు బయటకొస్తున్నాయి. తాజాగా పోలీసుల చేతికి మరో కీలక ఆధారం దొరికింది. దిశ కాలేయంలో

  • Published By: veegamteam ,Published On : December 14, 2019 / 06:24 AM IST
దిశ లివర్ లో మద్యం ఆనవాళ్లు : పోలీసుల చేతికి మరో కీలక ఆధారం

Updated On : December 14, 2019 / 6:24 AM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో.. సంచలన నిజాలు బయటకొస్తున్నాయి. తాజాగా పోలీసుల చేతికి మరో కీలక ఆధారం దొరికింది. దిశ కాలేయంలో

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో.. సంచలన నిజాలు బయటకొస్తున్నాయి. తాజాగా పోలీసుల చేతికి మరో కీలక ఆధారం దొరికింది. దిశ కాలేయంలో(లివర్) మద్యం ఆనవాళ్లు ఉన్నట్టు ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించారు. అత్యాచారానికి ముందు నిందితులు ఆమెతో బలవంతంగా మద్యం తాగించారన్న విషయం దీంతో రుజువైందని పోలీసులు చెబుతున్నారు.

అత్యాచారం సమయంలో నిందితులు దిశ నోట్లో బలవంతంగా మద్యం పోశారని పోలీసులు ప్రాథమిక విచారణలో వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా లివర్‌లో మద్యం ఆనవాళ్లు కనిపించడంతో దిశకు బలవంతంగా మద్యం తాగించారు అనేందుకు బలం చేకూర్చినట్లయింది. అంతేకాకుండా ఈ కేసులో పోలీసులకు ఈ ఆధారం కూడా బలంగా మారింది. అత్యాచార ఘటనకు సమీపంలో ఉన్న రన్‌వే 44 వైన్స్ మద్యం దుకాణంలో నిందితులు మద్యం సీసాలను కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని సైతం సేకరించారు.

అత్యాచారం సమయంలో నిందితులు దిశ నోట్లో బలవంతంగా మద్యం పోశారని.. వాంగ్మూలంలోనూ నిందితులు ఇదే విషయం చెప్పినట్టు పోలీసులు రిమాండ్ డైరీలో సైతం పేర్కొన్నారు. ఆ విషయం ఇప్పుడు ఆధారాలతో సహా ఫోరెన్సిక్ నివేదిక ధ్రువీకరించింది. మరోవైపు దిశ నిందితుల మృతదేహాలు ఇంకా గాంధీ ఆస్పత్రి మార్చురీలోనే ఉన్నాయి. ఈ ఎన్‌కౌంటర్ వ్యవహారంలో జ్యుడీషియల్ ఎంక్వైరీ కోసం సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిషన్ జోక్యం చేసుకొనే వరకూ శవాలను జాగ్రత్తగా ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నిందితుల మృతదేహాల అప్పగింత అంశంపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ కేసులో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సూచించింది. ఆఖరి చూపు కోసం నిందితుల కుటుంబసభ్యులు ఎదురుచూస్తున్నారు.

హైదరాబాద్‌ శివారు శంషాబాద్‌ సమీపంలోని తొండుపల్లి సర్వీస్‌ రోడ్డులోని చటాన్‌పల్లి దగ్గర వెటర్నరీ డాక్టర్‌ దిశపై నలుగురు కామాంధులు అత్యాచారం చేశారు. ఆ తర్వాత బతికుండగానే సజీవదహనం చేశారు. దీనిపై దేశ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమయ్యాయి. నలుగురు నరరూప రాక్షసులను వెంటనే ఉరి తీయాలని నిరసనలు హోరెత్తాయి. ఆ తర్వాత నిందితులను తమ కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా.. ఆయుధాలు లాక్కుని దాడి చేసి పారిపోయే ప్రయత్నం చేయగా.. ఆత్మరక్షణ కోసం పోలీసులు ఆ నలుగురినీ ఎన్‌కౌంటర్ చేసిన విషయం విదితమే.