ప్రాణం తీసిన లాక్ డౌన్, భార్య ఎడబాటు తట్టుకోలేక భర్త ఆత్మహత్య
కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రానివ్వడం లేదు. అత్యవసరమైన

కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రానివ్వడం లేదు. అత్యవసరమైన
కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రానివ్వడం లేదు. అత్యవసరమైన పనులు ఉంటే తప్ప రోడ్డు ఎక్కేందుకు పోలీసులు పర్మిషన్ ఇవ్వడం లేదు. కాగా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ ఓ వ్యక్తి పాలిట శాపమైంది. అతడి ప్రాణం తీసింది. పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి రాలేకపోవడంతో ఆమె ఎడబాటును భరించలేని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
గోండాలోని రాధా కుంద్ ప్రాంతానికి చెందిన రాకేశ్ సోని(32) వివాహితుడు. అతని భార్య లాక్‌డౌన్‌కు ముందు ఆమె తల్లిగారింటికి వెళ్లింది. సరిగ్గా అదే సమయంలో ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించడంతో రవాణా సౌకర్యాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఆమె తిరిగి రాలేకపోయింది. తన దగ్గర భార్య లేకపోవడం రాకేశ్ తట్టుకోలేకపోయాడు. తనలో తనే కుమిలిపోయాడు. ఒంటరిగా ఫీలయ్యాడు. డిప్రెషన్ లోకి జారుకున్నాడు. ఆమె లేకుండా జీవించడం తన వల్ల కాదని భావించిన రాకేశ్ భార్య ఎడబాటు భరించలేక ఉసురు తీసుకున్నాడు. గదిలోని ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయాడు.(కోతులకూ తప్పని లాక్ డౌన్ కష్టాలు : తిండి దొరక్క ఇళ్లపై దాడి)
కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా కోట్లమంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేకమంది ఉపాధి కోల్పోయారు. తినడానికి తిండి కూడా దొరకడం లేదు. మరికొందరు తమ వారిని కడసారి చూసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. కుటుంబసభ్యులు లేకుండానే అంత్యక్రియలు జరిగిపోతున్నాయి.