ఆంజనేయస్వామి ఆలయాన్ని ఢీకొట్టిన లారీ

ప్రకాశం జిల్లాలో ఆంజనేయస్వామి ఆలయాన్ని ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు.

  • Published By: veegamteam ,Published On : March 9, 2019 / 05:29 AM IST
ఆంజనేయస్వామి ఆలయాన్ని ఢీకొట్టిన లారీ

ప్రకాశం జిల్లాలో ఆంజనేయస్వామి ఆలయాన్ని ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు.

ప్రకాశం : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆంజనేయస్వామి ఆలయాన్ని ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. పోలీసుల కథనం ప్రకారం… విజయవాడ నుంచి ఒంగోలుకు వెళ్తున్న లారీ మార్గంమధ్యలో మార్చి 9 శనివారం తెల్లవారుజామున అద్దంకి మండలం వెంకటాపురం గ్రామం వద్ద ఒంగోలు-విజయవాడ నేషనల్ హైవే పక్కన గల ఆంజనేయస్వామి ఆలయాన్ని ఢీకొట్టింది. దీంతో లారీ డ్రైవర్‌, క్లీనర్‌ కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. 

మృతదేహాలు లారీ​ క్యాబిన్‌లో ఇరుక్కుపోవడంతో స్థానికులు పోలీసుల సాయంతో బయటకు తీశారు. నిద్ర మత్తు కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. లారీ బిహార్‌కు చెందినదిగా గుర్తించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.