lovers end life : ప్రేమ విఫలమైందని ప్రేమజంట ఆత్మహత్య

lovers end life : ప్రేమ విఫలమైందని ప్రేమజంట ఆత్మహత్య

Couple Suicide Due To Love Failure

Updated On : March 17, 2021 / 5:17 PM IST

lovers end life due to love failure in nizamabad : నిజామాబాద్ లో ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరి ప్రేమను ఒప్పుకోని పెద్దలు ప్రియుడికి రెండు నెలల క్రితం వేరే యువతితో పెళ్లి చేశారు. ఈ ఘటనతో ప్రియురాలు ప్రియుడ్ని నిలదీసింది. దీంతో ఇద్దరూ కలిసి ఆత్మహత్యాయత్నం చేశారు.

నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ మండలం పందిమడుగు గ్రామానికి చెందిన వందన, చింతల్ తండాకు చెందిన సుభాష్ కొన్నేళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమను ఇంట్లో పెద్దలు అంగీకరించలేదు.  2నెలల క్రితం సుభాష్ కు వేరే యువతితో వివాహం జరిపించారు.

పాత ప్రేమికులు ఇటీవల మళ్ళీ కలుసుకున్నారు. ఈ క్రమంలో తనను కాకుండా వేరే యువతిని పెళ్లి చేసుకున్నావేంటని యువతి సుభాష్ ను నిలదీసింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధింటి ఒక వీడియో సోషల్ మీడియా లోవైరల్ అయ్యింది.

దానిలో ఉన్నదాని ప్రకారం..పురుగుల మందు తాగిన ప్రేమికులను గుర్తించిన ఒక వ్యక్తి అక్కడకు చేరుకుని వారిని ఆస్పత్రికి తరలించే యత్నం చేశాడు. తాగిన పురుగులు మందు కక్కాలని ప్రేమికులను కోరాడు. అందుకు వారిద్దరూ తిరస్కరించారు. ఇలాగేఉంటే చనిపోతారని గట్టిగా హెచ్చరించినా వారు పట్టించుకోకపోగా…చనిపోవటానికి తాము సిధ్ధమే అంటూ చెప్పుకొచ్చారు.

అనంతరం వారిని కరీంనగర్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్సపొందుతూ ప్రియురాలువందన బుధవారం చనిపోగా…ప్రియుడు సుభాష్ పరిస్ధితి విషమంగా ఉంది. ఈ ఘటనపై తల్లితండ్రులు ఫిర్యాదు చేయటంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.