భార్యను ఇంటికి రప్పించేందుకు 3 సంవత్సరాల కొడుకును కిడ్నాప్ చేసిన తండ్రి

  • Published By: madhu ,Published On : October 10, 2020 / 09:31 AM IST
భార్యను ఇంటికి రప్పించేందుకు 3 సంవత్సరాల కొడుకును కిడ్నాప్ చేసిన తండ్రి

Updated On : October 10, 2020 / 10:19 AM IST

Man Arrested For Kidnapping : భార్యను ఇంటికి రప్పించేందుకు సొంత కొడుకునే కిడ్నాప్ చేయించాడో ఓ తండ్రి. తన మనవడిని ఎవరో కిడ్నాప్ చేశారని Tathawade ప్రాంతానికి చెందిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.



దీంతో పోలీసులు దర్యాప్తు చేశారు. 30 సంవత్సరాల సోలాపూర్ నివాసి, అతని స్నేహితుడిని పూణే పోలీసులు అరెస్టు చేశారు. గత కొన్ని నెలలుగా Tathawade లో తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్న భార్యను ఇంటికి రప్పించేందుకు ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.
Tathawade లో నివాసం ఉంటున్న ఓ మహిళ..మంగళవారం Wakad పీఎస్ కు చేరుకుంది.



తన మనవడిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మధ్యాహ్న సమయంలో..తన ఇంటికి వచ్చి ఇళ్లు కిరాయి గురించి మాట్లాడుతూ..మూడు సంవత్సరాలున్న తన మనవడని ఎత్తుకెళ్లాడని చెప్పింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలింపు చేపట్టారు.



Uruli Kanchan వద్ద ఉన్నట్లు గుర్తించారు. వెంటనే Pimpri Chinchwad crime branch అక్కడకు చేరుకుని మూడు సంవత్సరాల పిల్లాడిని కాపాడారు. తండ్రిని, అతని స్నేహితుడిని (Rasta Peth) పట్టుకుని Wakad పోలీసులకు అప్పగించినట్లు Ambarish Deshmukh (assistant inspector) వెల్లడించారు. బాలుడు ఇప్పుడు తన తల్లితో ఉన్నాడన్నారు. Rasta Peth విచారించగా..ప్రణాళిక ప్రకారం..తండ్రి బాలుడిని కిడ్నాప్ చేయించాడని అంగీకరించాడు.