Goa: గోవా రిసార్టు నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి స్నేహితుడి మీద కేసు పెట్టిన యువతి.. ఏం జరిగిందంటే?

పోలీసు అధికారి జీవ్‌బా దాల్వీ తెలిపిన వివరాల ప్రకారం.. విమానంలో ఇద్దరు కలిశారు. సంభాషణలో, వారిద్దరూ స్నేహితులు అయ్యారు. ఆ తర్వాత నిందితుడు లక్ష్మణ్ షియార్ మహిళ మొబైల్ నంబర్ తీసుకున్నాడు

Goa: గోవా రిసార్టు నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి స్నేహితుడి మీద కేసు పెట్టిన యువతి.. ఏం జరిగిందంటే?

Crime: వారిద్దకి కొద్ది రోజుల క్రితం విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో పరిచయం ఏర్పడింది. అనంతరం ఒకరోజు ఆ వ్యక్తి మహిళకు ఫోన్ చేసి గోవాలోని ఓ రిసార్ట్‌లో కలవాలని పిలిచాడు. స్నేహితుడి పిలుపు మేరకు వచ్చిన ఆమె అతడు బలవంతంగా అత్యాచారం చేశాడు. అంతే.. అక్కడి నుంచి పరుగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లి, నిందితుడిపై కేసు నమోదు చేసింది. గోవాలో జరిగిందీ ఉదంతం.

Uttar Pradesh: పక్క సీటులో భార్య, 100 కి.మీ వేగంతో గంగా నదిలోకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే?

అత్యాచారం అనంతరం ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే బాగోదని బాధితురాలిని అతడు బెదిరించాడట. నిందితుడికి 47 ఏళ్లు, గుజరాత్‌కు చెందిన వ్యక్తి కాగా, అత్యాచార బాధితురాలి వివరాలు తెలియరాలేదు. మరోవైపు, మహిళ ఫిర్యాదు ఆధారంగా, పోలీసు బృందాలను ఏర్పాటు చేసి, ఉత్తర గోవాలోని మపుసా పట్టణానికి సమీపంలోని థివిమ్ గ్రామంలో నిందితుడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడు జైలులో ఉన్నాడు.

Congress : కాంగ్రెస్ సీటు కోసం 1000 మంది దరఖాస్తు.. కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి, దరఖాస్తు చేయని ఐదుగురు ముఖ్య నేతలు

నార్త్ గోవాలోని అసోనోరా గ్రామంలో అత్యాచారం జరిగిన ఈ కేసులో, నిందితుల బారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న మహిళ, పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత అరెస్టు చర్యలు తీసుకున్నారు. విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో నిందితుడు మహిళను కలిశాడని కూడా తెలిసింది. అతడు మహిళ నంబర్‌ను తీసుకున్నాడు. అప్పటి నుంచి ఆమెతో నిరంతరం టచ్‌లో ఉన్నాడు. కొంత కాలానికి గోవాకి పిలిచాడు.

CVoter Survey: 2024 ఎన్నికల్లో బీజేపీని ఇండియా కూటమి ఓడిస్తుందా? ఇంతకీ ఆ కూటమిపై ప్రజల అభిప్రాయం ఏంటి?

అత్యాచార ఘటన ఆగస్టు 23న జరిగిందని అసోనోరా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జీవ్బా దాల్వీ తెలిపారు. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు 47 ఏళ్ల లక్ష్మణ్ షియార్‌ను అరెస్ట్ చేశారు. నిందితులపై చట్టపరమైన సెక్షన్ల ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారి తెలిపారు.

Bahujan Samaj Party: సమస్యే లేదు.. బీఎస్పీ తదుపరి చీఫ్ మాయావతి మేనల్లుడు ఆకాష్ ఆనందే!

పోలీసు అధికారి జీవ్‌బా దాల్వీ తెలిపిన వివరాల ప్రకారం.. విమానంలో ఇద్దరు కలిశారు. సంభాషణలో, వారిద్దరూ స్నేహితులు అయ్యారు. ఆ తర్వాత నిందితుడు లక్ష్మణ్ షియార్ మహిళ మొబైల్ నంబర్ తీసుకున్నాడు. దీని తరువాత, నిందితులు గత వారం గోవా సందర్శించడానికి వచ్చారు. ఆగస్టు 23న ఆ మహిళకు ఫోన్‌లో ఫోన్‌ చేసి.. అసోనోరాలో తాను ఉంటున్న రిసార్ట్‌లోని సౌకర్యాలను చూపుతానని చెప్పి అక్కడికి వెళ్లమని ఒప్పించాడు. ఆ తర్వాత ఈ ఉదంతం జరిగింది.