Love Cheating : సోషల్ మీడియాలో పరిచయం-పెళ్లి అనే సరికి పరారైన ప్రియుడు

సోషల్ మీడియా పరిచయాలతో మోసపోయిన మరో యువతి గాధ విశాఖపట్నంలో వెలుగు చూసింది.

Love Cheating : సోషల్ మీడియాలో పరిచయం-పెళ్లి అనే సరికి పరారైన ప్రియుడు

Love Affair In Facebook Friends

Updated On : September 15, 2021 / 8:16 PM IST

Love Cheating : సోషల్ మీడియా పరిచయాలతో మోసపోయిన మరో యువతి గాధ విశాఖపట్నంలో వెలుగు చూసింది. నగరంలోని ఒక షాపింగ్ మాల్‌లో సేల్స్ గర్ల్ గా పనిచేసే యువతికి వికాస్ అనే యువకుడు ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయ్యాడు.

ఇద్దరూ మొదట స్నేహితులుగా మాట్లాడుకోవటం ప్రారంభించారు. క్రమేపి ఆ స్నేహం ప్రేమగా మారింది. ఈక్రమంలో వారిద్దరూ మరింత సన్నిహితంగా మెలగసాగారు. ఈక్రమంలో ఆ యువతి గర్భం దాల్చింది. అప్పటినుంచి వికాస్ ఆమెను తప్పించుకు తిరగసాగాడు.

పెళ్లి చేసుకోమని అడిగితే మొహం చాటేసాడు. దీంతో మోసపోయానని గ్రహించిన యువతి ఈ రోజు మహిళా సంఘాల సపోర్ట్ తో త్రీటౌన్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.