‘పొంగల్ గిఫ్ట్’ కోసం గొడవ.. భార్యను గొడ్డలితో నరికేశాడు!
సంక్రాంతి పండుగకు ఒక రోజు ముందుగానే తమిళనాడులో విషాదం నెలకొంది. ప్రభుత్వం అందిస్తున్న పొంగల్ గిఫ్ట్ వెయ్యి రూపాయల కోసం కట్టుకున్న భార్యనే కడతేర్చాడో భర్త. నిద్రలో ఉన్న భార్యపై గొడ్డలితోదాడి చేసి చంపేశాడు.

సంక్రాంతి పండుగకు ఒక రోజు ముందుగానే తమిళనాడులో విషాదం నెలకొంది. ప్రభుత్వం అందిస్తున్న పొంగల్ గిఫ్ట్ వెయ్యి రూపాయల కోసం కట్టుకున్న భార్యనే కడతేర్చాడో భర్త. నిద్రలో ఉన్న భార్యపై గొడ్డలితోదాడి చేసి చంపేశాడు.
సంక్రాంతి పండుగకు ముందుగానే తమిళనాడులో విషాదం నెలకొంది. ప్రభుత్వం అందిస్తున్న పొంగల్ గిఫ్ట్ వెయ్యి రూపాయల కోసం కట్టుకున్న భార్యనే కడతేర్చాడో భర్త. నిద్రలో ఉన్న భార్యపై గొడ్డలితో దాడి చేసి చంపేశాడు. ఈ ఘటనలో ఆమె అక్కడిక్కడికే మృతిచెందింది. ఇటీవల సంక్రాంతి కానుకగా తమిళనాడు ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు రూ. వెయ్యి పొంగల్ గిఫ్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పొంగల్ గిఫ్ట్ కోసం రేషన్ షాపుల దగ్గర భారీ క్యూలు బారులు తీరాయి. కొన్నిచోట్ల రేషన్ షాపు నిర్వాహకులు పంపిణీ చేస్తున్న నగదు ఖాళీ కావడంతో నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పొట్టకూటి కోసం దూరప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్లినవారంతా ప్రభుత్వం అందించే వెయ్యి బోనస్ కోసం తిరిగి సొంత ఊరికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలో మదురై జిల్లా, ఉసిలంపట్టి సమీపంలోని ఏళుమలైలో రామర్ (70), అతని భార్య రాసమ్మాళ్ (65)దంపతులు తిరిగి గ్రామానికి వచ్చారు.
సంక్రాంతి గిఫ్ట్ గా అందజేస్తున్న రూ. వెయ్యి నగదును తీసుకున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. అసలు చిక్కు ఇక్కడే వచ్చింది. వెయ్యి రూపాయల నగదులో రూ. 500 తనకు ఇవ్వాలని భార్యను భర్త అడిగాడు. డబ్బులేవ్.. ఏం లేవ్.. ఇవ్వనుపో అంటూ గట్టిగా కసురుకుంది. ఎందుకు ఇవ్వవు అంటూ భార్య తో రామర్ గొడవకు దిగాడు. కాసేపటికి భార్య రాసమ్మాళ్ ఇంట్లో నిద్రపోయింది. అప్పటికి కోపం తగ్గని రామర్.. నిద్రపోతున్న భార్యను గొడ్డలితో నరికి చంపేశాడు. అనంతరం పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.