4 కిలోల బంగారం కోసం సోదరుడిని Murder

4 కిలోల బంగారం కోసం సోదరుడిని Murder

Updated On : September 29, 2020 / 10:49 AM IST

man murder:డ్రైవర్ తో కలిసి సోదరుడ్ని Murder చేశాడో వ్యక్తి. థానె జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. సినిమాటిక్ చేసిన ఈ క్రైమ్ పోలీసులను కూడా ఆశ్చర్యపరిచింది. ఎట్టకేలకు విచారణలో బంగారం కోసం వ్యక్తిని చంపేసి సాక్ష్యం ఉండకూడదని మృతదేహాన్ని వాశీ వాగులో తోసేసినట్లు వెల్లడించారు.




‘TMC కార్పొరేటర్ మానిక్ పటేల్ కొడుకు రాకేశ్ పాటిల్ సెప్టెంబర్ 20 నుంచి కనిపించడం లేదు. దాంతో పాటు 3.7కిలోల బంగారం ఇంట్లో కనిపించకుండాపోయింది. అతని భార్య కంప్లైంట్ చేయడంతో కసర్వాడవాలి పోలీసులు ఎంక్వైరీ చేపట్టారు.

రాకేశ్ పేరెంట్స్ హాస్పిటల్ లో ఉన్న సమయంలో ఇంటికి వెళ్లి బంగారం దోచుకున్నారు. వారంతా కొడుకు కనిపించకుండా పోతే అతడ్నే అనుమానిస్తారని భావించారు. స్కూటర్ మీద కనిపించాడని వారి కొడుకు గురించి చెప్పడానికి వెళ్తున్న డ్రైవర్ కు కూడా కాస్త ముట్టజెప్పారు.




పోలీస్ స్టైల్లో ఎంక్వైరీ తర్వాత డ్రైవర్ బయటపెట్టిన నిజాలు ఇలా ఉన్నాయి. ఆస్తి తగాదాల కారణంగా.. అతని సోదరుడు సచిన్ పాటిల్.. రాకేశ్ పాటిల్ ను హత్య చేశాడు. చనిపోయిన వ్యక్తికి మొబైల్ ఫోన్ వాడే అలవాటు లేకపోవడంతో టెక్నికల్ సర్వేలెన్స్ వాడి కేసును చేదించారు. హెల్ప్ చేస్తే రూ.2లక్షలు టిప్ ఇస్తానని చెప్పాడని డ్రైవర్ నిజం బయటపెట్టాడు.