నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం: నగ్నంగా నిందితుడి ఊరేగించిన జనం

నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం: నగ్నంగా నిందితుడి ఊరేగించిన జనం

Updated On : December 2, 2019 / 2:30 AM IST

ఓ 35సంవత్సరాల వయస్సున్న వ్యక్తి నాలుగేళ్ల బాలికను అత్యాచారం చేయబోయాడు. అప్రమత్తమైన స్థానికులు దేహశుద్ధి చేయడంతో పాటు నగ్నంగా వీధుల్లో ఊరేగించి పోలీసులకు అప్పగించారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో పర్డీ ప్రాంతంలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. 

జవహర్ వైద్య అనే వ్యక్తి కలెక్షన్ ఏజెంట్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో రోజూ ఇంటికి వెళ్లి డబ్బులు వసూలు చేసేవాడు. ఆదివారం సాయంత్రం ఇంట్లో బాలిక ఒంటరిగా ఉండటంతో అత్యాచారయత్నం చేశాడు. ఒక్కసారిగా బయటకు వెళ్లిన బాలిక తల్లి తిరిగివస్తూనే ఈ ఘటన చూసి ఒక్కసారిగా కేకలు పెట్టింది. 

అప్రమత్తమైన పొరుగువారు వచ్చి దేహశుద్ది చేశారు. నిందితుడి చేతులు తాడుతో కట్టేసి వీధుల్లో నగ్నంగా ఊరేగించారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. స్థానికుల ఫిర్యాదు మేర పలు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి పర్డీ పోలీసు స్టేషన్లో అరెస్టు చేశారు.