తల్లిదండ్రులూ బీ కేర్‌ఫుల్..! రైలు ప్రయాణంలో పిల్లల చేతికి ఫోన్ ఇస్తున్నారా? ఎంత ప్రమాదమో చూడండి..

రైలు ప్రయాణం చేసే వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Phone Snatch (Photo Credit : Google)

Viral Video : రైలు ప్రయాణంలో మీరు మీ పిల్లల చేతికి ఫోన్ ఇస్తున్నారా? మీ పనిలో మీరు నిమగ్న అవుతున్నారా? అయితే.. బీకేర్ ఫుల్.. ఇక ముందు జాగ్రత్త పడాల్సిందే. లేదంటే ఘోరాలు జరిగిపోవచ్చు. ఇలా హెచ్చరించడానికి కారణం లేకపోలేదు.. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది. రైల్లో ఓ పాప చేతిలో ఫోన్ పట్టుకుని కిటికీ పక్కనే కూర్చుని ఉంది. ఆ చిన్నారి ఫోన్ చూసుకుంటూ ఉంది. ఇందులో ఓ దొంగ… కిటికీ నుంచి చెయ్యి లోపలకి పెట్టి పాప చేతి నుంచి అమాంతం ఫోన్ లాగేసుకున్నాడు. దీంతో ఆ పాప బాగా భయపడిపోయింది. గట్టిగా కేకలు పెట్టింది. ఈ చోరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వివరాల్లోకి వెళితే.. ఓ పాప రైల్లో కిటికీ పక్కనే ఉన్న సీట్లో కూర్చుని ఉంది. ఆ పాప చేతిలో ఫోన్ ఉంది. అందులో గేమ్స్ ఆడుకుంటూ ఉంది. ఇంతలో ఓ దొంగ ఎక్కడి నుంచి వచ్చాడో కానీ.. సడెన్ గా విండోలో నుంచి చెయ్యి పెట్టి పాప చేతిలో ఉన్న ఫోన్ లాగేశాడు. ఫోన్ ను పాప గట్టిగా పట్టుకుంది. ప్రతిఘటించే ప్రయత్నం చేసింది. గట్టిగా కేకలు కూడా వేసింది. కానీ, లాభం లేకపోయింది. ఆ దొంగ చిన్నారి చేతిలో నుంచి ఫోన్ లాక్కుని అక్కడి నుంచి పారిపోయాడు. తోటి ప్యాసింజర్ ఇదంతా తన ఫోన్ లో వీడియో తీశాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా అవుతోంది. ట్రైన్ లో ప్రయాణించే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన చెబుతుంది.

ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది? అనే వివరాలు తెలియవు. అయినప్పటికి.. ఈ ఘటన ఒక హెచ్చరిక లాంటిది. రైలు ప్రయాణం చేసే వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విండోస్ పక్కన కూర్చునే వారు మరీ అలర్ట్ గా ఉండాలి. తల్లిదండ్రులు సైతం కేర్ ఫుల్ గా ఉండాల్సిందే. పిల్లల చేతికి ఫోన్లు ఇచ్చి చేతులు దులుపుకోవడం కరెక్ట్ కాదా. నిరంతరం వారిపై నిఘా ఉంచాలి. ఎప్పుడు ఎటువైపు నుంచి ప్రమాదం వస్తుందో తెలియని పరిస్థితి.

అయితే, ఇందులో నిజం లేదని, ఇదంతా నాటకం అని కొందరు నెటిజన్లు అంటున్నారు. ఇది డ్రామా అని, స్క్రిప్టడ్ వీడియో అని చెబుతున్నారు. అతడు దొంగ కాదు, ఆ పాప బంధువే అని కామెంట్ పెడుతున్నారు. ఆ వీడియోని క్లియర్ గా గమనిస్తే వాస్తవం ఏంటో తెలిసిపోతుందని అంటున్నారు. ఈ ఘటన.. నిజమో, కాదో, డ్రామానో, మరొకటో.. అనే సంగతి పక్కన పెడితే.. ఈ తరహా ఘటనలు జరక్కుండా ప్రయాణికులు అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయాన్ని కొందరు నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. రైలు ప్రయాణంలో నిర్లక్ష్యంగా ఉంటే.. ఈ తరహా ఘటనలు జరిగేందుకు ఆస్కారం ఉందని చెబుతున్నారు. ఏది ఏమైనా.. జాగ్రత్తగా ఉండటం మేలు అంటున్నారు. ఆ తర్వాత ఎంత బాధ పడినా.. ఎలాంటి ప్రయోజనం ఉండదంటున్నారు.

Also Read : అర్థరాత్రి ప్రయాణాలు చేస్తున్నారా? బీకేర్ ఫుల్.. వెన్నులో వణుకు పుట్టించే వీడియో…