Dog Shooting : అమ్మ బాబోయ్.. కుక్క కరిచిందని కాల్చి చంపేశాడు

Dog Shooting : ఇంటికి వెళ్లి తన లైసెన్స్డ్ తుపాకీ తీసుకొని వచ్చాడు. తనను కరిచిన కుక్కపై తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో ఆ కుక్క అక్కడికక్కడే చనిపోయింది.

Dog Shooting (Photo : Google)

Dog Shooting : కుక్క కరిచిందని దాన్ని కాల్చి చంపిన ఘటన హర్యానాలో జరిగింది. కురుక్షేత్ర జిల్లాలోని థానేసర్ లో ఓ నర్సింగ్ హోమ్ ఎదురుగా వెళ్తున్న సమయంలో సతీశ్ కుమార్ కపూర్ (67) అనే వ్యక్తిని ఓ కుక్క కరిచింది. దాంతో అతడు కోపంతో ఊగిపోయాడు. ఆ కుక్కను చంపేయాలని నిర్ణయించుకున్నాడు.

ఇంటికి వెళ్లి తన లైసెన్స్డ్ తుపాకీ, కుమారుడు శివమ్ కుమార్(27) తీసుకొని మళ్లీ అదే ప్రాంతానికి వచ్చాడు. తనను కరిచిన కుక్కపై తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో ఆ కుక్క అక్కడికక్కడే చనిపోయింది.

Also Read..Stray Dogs : భయానకం.. యూనివర్సిటీ క్యాంపస్‌లో డాక్టర్‌ని కరిచి చంపిన వీధి కుక్కలు.. వెన్నులో వణుకు పుట్టించే వీడియో

ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ యువకుడు ఇదంతా తన ఫోన్ లో వీడియో తీశాడు. దాని ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు కుక్కను కాల్చి చంపినందుకు కపూర్ పై కేసు నమోదు చేశారు. కపూర్, అతడి కొడుకు శివమ్ లను అరెస్ట్ చేశారు. అనంతరం బెయిల్ పై వారిని విడుదల చేశారు. సతీశ్ కుమార్ కపూర్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉద్యోగి. కపూర్ విష్ణు కాలనీలో నివాసం ఉంటున్నారు. పని మీద బయటికి వెళ్లి వస్తుండగా.. ఓ నర్సింగ్ హోమ్ దగ్గర ఓ వీధి కుక్క కపూర్ పై దాడి చేసింది. కపూర్ ను కరిచింది.

Also Read..Pit bull Dog Attacks : బాబోయ్.. వ్యక్తి ప్రైవేట్ పార్ట్ కొరికేసిన కుక్క, కొట్టి చంపిన జనం

జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం, ఆయుధ చట్టం, ఐపిసి సెక్షన్ 429 (పశువులను చంపడం లేదా హాని చేయడం మొదలైనవి) కింద కపూర్, అతడి కొడుకుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కపూర్ మోటార్ సైకిల్, తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.