Married Man Set Girl On Fire : పెళ్లికి ఒప్పుకోలేద‌ని.. నిద్ర‌పోతున్న యువ‌తిపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టిన వ్యక్తి

జార్ఖండ్ లోని దుమ్కా జిల్లాలో దారుణం జరిగింది. పెళ్లికి ఒప్పుకోలేద‌ని ఓ వివాహితుడు నిద్ర‌పోతున్న యువ‌తిపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టాడు. బాధితురాలిని ప‌రీక్షించిన వైద్యులు ఆమెకు 90 శాతం కాలిన గాయాలైన‌ట్లు తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.

Married Man Set Girl On Fire : పెళ్లికి ఒప్పుకోలేద‌ని.. నిద్ర‌పోతున్న యువ‌తిపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టిన వ్యక్తి

Married Man Set Girl On Fire

Updated On : October 7, 2022 / 8:14 PM IST

Married Man Set Girl On Fire : జార్ఖండ్ లోని దుమ్కా జిల్లాలో దారుణం జరిగింది. పెళ్లికి ఒప్పుకోలేద‌ని ఓ వివాహితుడు నిద్ర‌పోతున్న యువ‌తిపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టాడు. వివ‌రాల్లోకి వెళ్తే.. బాధితురాలి గ్రామానికే చెందిన రాజేశ్ రౌత్‌కు ఇప్ప‌టికే వివాహమైంది. అయినా గ్రామంలోని 19 ఏళ్ల యువ‌తిని త‌న‌ను పెళ్లి చేసుకోవాలంటూ వేధిస్తున్నాడు. అందుకు బాధితురాలు నిరాక‌రించినా విడిచిపెట్ట‌లేదు.

మ‌ళ్లీ మ‌ళ్లీ ఆమె ఒత్తిడి చేశాడు. దాంతో ఆమె త‌న కుటుంబ‌స‌భ్యులకు విష‌యం చెప్పింది. వాళ్లు కూడా రాజేశ్‌కు చీవాట్లు పెట్టి, మ‌రోసారి తమ పిల్ల జోలికి రావ‌ద్ద‌ని హెచ్చ‌రించారు. దీంతో యువ‌తిపై రాజేశ్ కోపం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో అతడు బాధితురాలికి ఇంటి వెళ్లాడు. నిద్ర‌పోతున్న యువ‌తిపై పొట్రోల్ పోసి నిప్పు పెట్టి అక్క‌డి నుంచి ప‌రార‌య్యాడు.

Warangal: వరంగల్‌లో ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిపై దాడి..

వెంట‌నే కుటుంబ‌స‌భ్యులు ఆమెను ఆస్ప‌త్రికి తీసుకెళ్ల‌ారు. వారు మెరుగైన చికిత్స కోసం రాంచికి రిఫ‌ర్ చేశారు. బాధితురాలిని ప‌రీక్షించిన వైద్యులు ఆమెకు 90 శాతం కాలిన గాయాలైన‌ట్లు తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. మృత్యువుతో పోరాడుతోంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.