Fire Accident : రేణిగుంట ఫాక్సీలింక్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం.. ఎయిర్ పోర్టు సమీపంలోనే ఘటన

తిరుపతి రేణిగుంట ఫాక్సీలింక్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. కంపెనీ మొత్తం దట్టమైన పొగలు అలుముకున్నాయి.

Fire Accident : రేణిగుంట ఫాక్సీలింక్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం.. ఎయిర్ పోర్టు సమీపంలోనే ఘటన

FIRE ACCIDENT

Updated On : February 27, 2023 / 4:07 PM IST

Fire Accident : తిరుపతి రేణిగుంట ఫాక్సీలింక్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. కంపెనీ మొత్తం దట్టమైన పొగలు అలుముకున్నాయి. రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి కంపెనీ దగ్గర ఉండటంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుంది.

మూడు ఫైరింజన్లతో మంటలను అదపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది.  రేణిగుంట ఫాక్సీలింక్ కంపెనీలో డేటా కేబుల్ తయారవుతోంది. సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా అగ్నిప్రమాదం సంభవించింది. అయితే లంచ్ టైమ్ లో ప్రమాదం జరగడంతో ఇప్పటివరకు ప్రాణాపాయం జరగలేదని తెలుస్తోంది.

Fire Accident Assam : అసోంలో భారీ అగ్నిప్రమాదం.. 150 దుకాణాలు దగ్ధం

ప్రమాదం జరిగినప్పుడు కంపెనీలో చిక్కుకున్న వారు అతి కష్టం మీద బయట పడ్డారు. కొంతమంది మొదటి అంతస్తు నుంచి దూకి కూడా బయటికొచ్చారు. మరికొంత మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. రేణిగుంట పోలీసులు, రెవన్యూ యంత్రాంగం, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ఘటనా స్థలికి చేరుకున్నారు. కంపెనీ పూర్తిగా అంటుకుంది. కంపెనీ లోపల రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.