Gold Shop Robbery: గోడకు కన్నం వేసి.. షట్టర్ కట్ చేసి.. 18 కిలోల బంగారం చోరీ.. సూర్యాపేటలో భారీ దొంగతనం

షాపు వెనుక భాగంలో విలువైన ఆభరణాలు పెట్టుకునే స్టోరేజ్ పాయింట్ ఉంది. దాని పక్కనే బాత్రూమ్ ఉంటుంది.

Gold Shop Robbery: గోడకు కన్నం వేసి.. షట్టర్ కట్ చేసి.. 18 కిలోల బంగారం చోరీ.. సూర్యాపేటలో భారీ దొంగతనం

Updated On : July 21, 2025 / 5:04 PM IST

Gold Shop Robbery: సూర్యాపేటలో భారీ చోరీ జరిగింది. సాయి సంతోషి నగల దుకాణంలో దొంగలు పడ్డారు. ఏకంగా 18 కిలోల బంగారం ఎత్తుకెళ్లారు దొంగలు. జువెలరీ షాపు వెనకవైపున్న గోడకు రంధ్రం చేసి లోపలికి ప్రవేశించారు దొంగలు. షాపులోని 18 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ జరుపుతున్నారు.

”షాపు వెనుక భాగంలో విలువైన ఆభరణాలు పెట్టుకునే స్టోరేజ్ పాయింట్ ఉంది. దాని పక్కనే బాత్రూమ్ ఉంటుంది. దానికి ఔట్ సైడ్ నుంచి మరొక బాత్రూమ్ ఉంది. రెండు బాత్రూమ్ లకు మధ్య ఉన్న గోడకు రంధ్రం వేసి లోపలికి ప్రవేశించారు. స్టోరేజ్ పాయింట్ దగ్గరికి చేరుకున్నారు. దాని షట్టర్ ను గ్యాస్ కట్టర్ తో కట్ చేశారు. లోపలకి వెళ్లి చోరీ చేసినట్లు నిర్ధారణ అయ్యింది. క్లూస్ టీమ్ క్లూస్ సేకరిస్తోంది. 2011లోనూ ఇదే తరహా చోరీ జరిగింది” అని సూర్యాపేట ఎస్పీ నర్సింహ తెలిపారు.

 

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఉన్న సాయి సంతోషి జువెలరీ షాపులో అర్థరాత్రి భారీ చోరీ జరిగింది. ఇవాళ ఉదయం షాపు తెరిచి చూడగా.. యజమాని షాక్ కి గురయ్యారు. చోరీ జరిగినట్లు తెలుసుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. 18 కిలోల వరకు బంగారం చోరీకి గురైనట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. స్టోరేజ్ పాయింట్ లో ఎప్పుడూ కూడా 18 కిలోల బంగారం వరకు స్టోర్ చేసి ఉంటారు.

Also Read: ఎమ్మెల్యే శ్రీగణేష్‌పై దాడికి యత్నం కేసులో కీలక విషయాలు వెలుగులోకి..

షాపు వెనకవైపు బాత్రూమ్ ఉంటుంది. దానికి గోడకి లింక్ ఉంది. పక్కా ప్లాన్ తో చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇది తెలిసిన వాళ్ల పనే అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. జువెలరీ షాపు గురించి బాగా తెలిసిన వాళ్లే ఈ పని చేసి ఉండొచ్చని పోలీసులు డౌట్ పడుతున్నారు. బంగారం షాపులో భారీ చోరీ స్థానికంగా సంచలనంగా మారింది. ఈ దొంగతనంతో స్థానికంగా ఉండే గోల్డ్ షాపుల యజమానులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు గస్తీ పెంచాలని కోరుతున్నారు.