ఎమ్మెల్యే శ్రీగణేష్‌పై దాడికి యత్నం కేసులో కీలక విషయాలు వెలుగులోకి..

ఎమ్మెల్యే ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఓయూ పోలీసులు నిందితులను గుర్తించేందుకు రంగంలోకి దిగారు. తార్నాక ఆర్టీసీ హాస్పిటల్ దగ్గర సీసీ పుటేజ్‌లను పరిశీలించారు.

ఎమ్మెల్యే శ్రీగణేష్‌పై దాడికి యత్నం కేసులో కీలక విషయాలు వెలుగులోకి..

MLA Sri Ganesh

Updated On : July 21, 2025 / 8:57 AM IST

Attack On MLA Sri Ganesh: కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ పై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి యత్నించిన ఘటన రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. ఈ కేసులో ఓయూ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఆదివారం రాత్రి 8.40 గంటల సమయంలో గణేశ్ కారుపై కొందరు యువకులు దాడికి యత్నించారు. కారును వెంబడిస్తూ దాడి చేసేందుకు ప్రయత్నించారు.

Also Read: తెలంగాణలో వానలేవానలు.. ఇవాళ, రేపు ఈ జిల్లాల్లో అతి భారీవర్షాలు.. అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు

మునికేశ్వర్ నగర్‌లో బోనాల సందర్భంగా పాలరంబండి ఊరేగింపు కార్యక్రమానికి వెళ్తున్న ఎమ్మెల్యే గణేశ్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి యత్నించారు. అప్రమత్తమైన ఎమ్మెల్యే.. 200 మీటర్ల దూరంలో ఉన్న ఓయూ పోలీసులను ఆశ్రయించారు. శ్రీగణేష్ వాహనం, అతనిపై దాడికి యత్నించిన తర్వాత అడిక్మెట్ వైపు యువకులు బైకులపై వెళ్లారు. ఎమ్మెల్యే ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఓయూ పోలీసులు నిందితులను గుర్తించేందుకు రంగంలోకి దిగారు. తార్నాక ఆర్టీసీ హాస్పిటల్ దగ్గర సీసీ పుటేజ్‌లను పరిశీలించారు. దాడికి యత్నించిన యువకులను త్వరలోనే పట్టుకుంటామని ఓయూ పోలీసులు తెలిపారు.

ఈ దాడి ఘటన గురించి ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ.. తార్నాక నుండి మా కారును ఫాలో అవుతూ రెండు వైపులా బైకులతో బ్లాక్ చేశారు. ఆర్టీసీ హాస్పిటల్ వద్ద కారును అడ్డగించి ఆపారు. పది బైకులపై ముగ్గురు ముగ్గురుగా వచ్చి కారు అద్దాలపై దాడిచేసి పగలగొట్టే ప్రయత్నం చేశారు. నాపై అటాక్ చెయ్యడానికి మీదకి వచ్చారు. నా వ్యక్తిగత గన్‌మెన్ అడ్డొచ్చి వారిని ఆపాడు. అయినా వారు ఆగకపోగా.. నా గన్‌మెన్‌నూ లాగేసే ప్రయత్నం చేశారు. ఉస్మానియా పోలీస్ స్టేషన్ పక్కనే ఉండటంతో వెంటనే అక్కడికి వెళ్లి దాడి విషయంపై ఫిర్యాదు చేశాం. పక్కా ప్రణాళిక ప్రకారం నాపై దాడికి యత్నించారని ఎమ్మెల్యే గణేష్ తెలిపారు. నిందితులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు అందించిన ఫిర్యాదులో ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఎమ్మెల్యే పీఎస్‌లో ఫిర్యాదు చేసిన కంప్లైంట్ కాపీ..