తెలంగాణలో వానలేవానలు.. ఇవాళ, రేపు ఈ జిల్లాల్లో అతి భారీవర్షాలు.. అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు
తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. అయితే, సోమ, మంగళవారంకూడా పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Heavy Rain
Rain Alert: తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. దక్షిణ కర్ణాటక నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతోంది. ఈ కారణంగా శనివారం, ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఆదివారం పగటిపూట అత్యధికంగా నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో 7.5 సెం.మీ వర్షపాతం నమోదైంది. అయితే, సోమ, మంగళవారం పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Also Read: హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ అలెర్ట్.. రెండు రోజులు… ఈ రూట్లలో అస్సలు వెళ్లొద్దు…
రాష్ట్రంలో ఇవాళ (సోమవారం), రేపు (మంగళవారం) పలు జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జనగామ, సిద్ధిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాల్లో సోమ, మంగళవారాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
బుధ, గురువారాల్లో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ఆయా జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
Also Read: మహిళా సంఘాలకు బంపర్ ఆఫర్.. తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త ప్లాన్.. మంత్రి సీతక్క ఆమోదం..